ప్రశాంత్ కిషోర్ ప్లాన్ 2.. ప్రచారంలో దూసుకుపోతున్న మమతా బెనర్జీ..

0
3


ప్రశాంత్ కిషోర్ ప్లాన్ 2.. ప్రచారంలో దూసుకుపోతున్న మమతా బెనర్జీ..

బెంగాల్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయ ప్రచారంలో దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దీదీ కా బోలో వెబ్‌సైన్ ప్రారంభించిన మమతా బెనర్జీ, మరోసారి అసలు తన పని తనం గురించి ప్రజల అభిప్రాయాలను కోరుతోంది.ఇందులో భాగంగానే దీదీ కా ప్రైడ్ అనే ఆన్‌లైన్ సర్వేకు తెరతీసింది.

సోషల్ మీడీయా క్యాంపెయిన్…

ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీని ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు. వారి అనుభవాలతోపాటు ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ది పనులపై అభిప్రాయాలను కోరుతోంది. మొత్తం ఎనిమిది సంవత్సరాల కాలంలో మమతా బెనర్జీ చేసిన అభివృద్దితోపాటు దీదీకా ప్రైడ్ పేరుతో ప్రజల్లో ప్రచారం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల అభిప్రాయాలను సోషల్ మీడీయాల షేర్ చేసే విధంగా పావులు కదుపుతోంది.

 ఆన్‌లైన్‌లో సేవలు

ఆన్‌లైన్‌లో సేవలు

మరోవైపు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దీదీకా బోలో అనే ఓ వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించింది. ప్రజలు ఏవైన సమస్యలు ఉంటే దానికి మెయిల్ చేసేందుకు గాను వీలు కల్పించింది. ఈనేపథ్యంలోనే బూత్ స్థాయిలో పార్టీని పటిష్ట పరిచి పార్టీ కమిటీలతో పాటు జిల్లా స్థాయి కమిటీలను పటిష్టం చేయనున్నారు.

నేరుగా ప్రజలతో సంబంధాలు

నేరుగా ప్రజలతో సంబంధాలు

ఇందులో బాగంగానే కార్యకర్తలు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. నేటి 100 రోజుల పాటు పల్లే బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సుమారు 1000 మంది 10 వేల గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించింది. గ్రామస్థుల సమస్యలు తెలసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేయాలని నిర్ణయించింది. ఇలా వంద రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here