ప్రసూతి శాస్త్రంలో మార్పులొస్తున్నాయ్‌

0
0


ప్రసూతి శాస్త్రంలో మార్పులొస్తున్నాయ్‌

 

నిజామాబాద్‌(కంఠేశ్వర్‌), న్యూస్‌టుడే: ప్రసూతి శాస్త్రంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి..వాటికనుగుణంగా సన్నద్ధం కావాలని వైద్యనిపుణులు సూచించారు. గర్భిణులకు వచ్చే సమస్యలు, చేయాల్సిన చికిత్సపై నిజామాబాద్‌లో కార్యశాల నిర్వహించారు. 5వ రాష్ట్ర స్థాయి గైనకాలజీ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. ఈ సదస్సులో గర్భిణులకు వచ్చే సమస్యలు, పరిష్కారాన్ని వైద్య నిపుణులు కిరణ్‌, నితిన్‌, అశోక్‌కుమార్‌, హేమంత్‌దేశ్‌పాండేలు వివరించారు. గర్భం దాల్చి ప్రసవించే వరకు గర్బిణులకు వచ్చే సమస్యలకు ఆధునికంగా ఉన్న చికిత్స విధానాలను వివరించారు. సదస్సులో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి స్త్రీవైద్య నిపుణులు హాజరయ్యారు. ఇందులో టీసీవోజీఎస్‌ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి శాంతకుమారి, కార్యనిర్వాహక ఛైర్‌పర్సన్‌ రమాదేవి, కో ఛైర్‌పర్సన్లు కేఎస్‌ స్వామి, కవితారెడ్డి, కార్యదర్శి పద్మజ సురేశ్‌, కోశాధికారి వినోద తదితరులు పాల్గొన్నారు.


కార్యశాలలో వివరిస్తున్న డాక్టర్‌, హాజరైన స్త్రీ వైద్యనిపుణులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here