ప్రాణాలు పోతేనే స్పందించిన అధికారులు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం వాహనదారుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్లు రైతుల కల్లాలుగా మారాయి. రోడ్లపైనే ధాన్యం కుప్పలు వేయడం వలన వాహనదారులకు ప్రాణహాని ఉందని పత్రికలలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయినా అధికారులు స్పందించలేదు. నందిపేట్‌ మండలంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వలన మేల్కొన్నారు. ధాన్యం కుప్పల మూలంగా రెండు నిండు ప్రాణాలు పోయిన తర్వాత ఇట్టి సమస్యపై జిల్లావ్యాప్తంగా అధికారులు దష్టి కేంద్రీకరించి రోడ్లపై ధాన్యాలు ఆరబెట్టిన వారిపై చట్టపర చర్యలు ప్రారంభించారు. మండల కేంద్రంలోని బంగారు ఇరిగేషన్‌ వద్ద ఆరబెట్టిన ధాన్యం కుప్ప మూలంగా ఇద్దరు యువకులు మతి చెందారు. దాంతో ఆగ్రహం చెందిన ప్రజలు ఘటనా స్థలంలోనే రాస్తారోకో నిర్వహించి కుప్పలు తొలగించాలని ధర్నా చేశారు. దీంతో స్పందించిన స్థానిక ఎస్సై రాఘవేందర్‌ మతికి కారకుడైన ధాన్యం యజమాని మురళిపై 304 కేసు నమోదు చేశారు. మండలంలో వీరిద్దరి మరణంతో పాటు మరో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రి పాలైన వారి వివరాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ధాన్యం కుప్పల ప్రమాదాలతో పోలీసులకు తలనొప్పిగా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here