ప్రాధాన్య రంగాలకు పండగే: కోలెండింగ్ కు శ్రీకారం చుట్టనున్న ఎస్బీఐ

0
4


ప్రాధాన్య రంగాలకు పండగే: కోలెండింగ్ కు శ్రీకారం చుట్టనున్న ఎస్బీఐ

దేశీయ బ్యాంకింగ్ రంగంలో కొత్త ఒరవడి ప్రారంభం కాబోతోంది. దీనికి ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) శ్రీకారం చుట్టబోతోంది. బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలతో (ఎన్ బీ ఎఫ్ సి) కలిసి రుణాలను మంజూరు చేయడానికి సన్నద్ధం అవుతోంది. నాలుగైదు మధ్య స్థాయినుంచి భారీ స్థాయి లో ఉన్న ఎన్ బీ ఎఫ్ సి లతో కలిసి ఈ విధానంలో రుణాలను మంజూరు చేయాలని ఎస్ బీ ఐ భావిస్తోంది. ఈ విధానాన్ని కో-లెండింగ్ బిజినెస్ గా పేర్కొంటారు.

ఎన్ బీ ఎఫ్ సి లతో టెక్నాలజీకి సంబంధించిన ఇంటిగ్రేషన్ పూర్తయితే కో- లెండింగ్ రుణాలు ప్రారంభం అవుతాయని ఎస్ బీ ఐ అధికారి ఒకరు తెలిపారు.

ఏమిటీ ప్రత్యేకత…

* కో లెండింగ్ విధానం పూర్తిగా ఆటోమేటెడ్ గా ఉంటుంది. ఇందులో మానవ ప్రమేయం ఉండదు. కస్టమర్ల వ్యాపార ప్రతిపాదన నుంచి రుణం అందేవరకు ఈ ప్రక్రియలో ఎవరి ప్రమేయం ఉండదు.

* కో లెండింగ్ లో రుణ గ్రహీతకు బ్యాంక్ 70-80 శాతం రుణాన్ని ఇస్తే మిగతా మొత్తాన్ని ఎన్ బీ ఎఫ్ సి సమకూర్చాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రాధాన్య రంగానికి సంబంధించిన రుణానికి అమలవుతుంది.

* భారత రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు కో లెండింగ్ కు సిద్ధం అవుతున్నాయి.

* ఉత్పాదక రంగానికి రుణ సదుపాయాన్ని పెంచే ఉద్దేశంతో ఆర్ బీ ఐ ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఎన్ బీ ఎఫ్ సి రంగంలో నెలకొన్న రుణ సంక్షోభం నేపథ్యంలో ఈ కొత్త విధానాన్ని ఆర్ బీ ఐ ప్రవేశ పెట్టింది.

* ఈ విధానం ద్వారా బ్యాంకులకు కూడా ప్రయోజనం కలగనుంది. బ్యాంకులు ప్రాధాన్య రంగాలకు తప్పని సరిగా రుణాలను అందించాల్సి ఉంటుంది. ఎన్ బీ ఎఫ్ సి లతో చేతులు కలపడం వల్ల బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

* రిస్క్, రివార్డ్ ను బ్యాంకు, ఎన్ బీ ఎఫ్ సి రెండు పంచుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రెండు ఆర్ధిక సంస్థలు కూడా భాద్యతా యుతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది.

ఇతర బ్యాంకులు కూడా…

* దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న బ్యాంకు అఫ్ బరోడా కూడా ఎన్ బీ ఎఫ్ సీలు, ఫిన్ టెక్ కంపెనీలతో కలిసి రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

* ఇప్పటికే శ్రేయీ ఎక్విప్ మెంట్ ఫైనాన్స్, ఈ సి ఎల్ ఫైనాన్స్ వంటి కంపెనీలతో చేతులు కలిపింది. ఇన్ఫ్రా స్ట్రక్టర్, ఎం ఎస్ ఎం ఈ లకు ఈ మేరకు బ్యాంకు రుణాలు అందించనుంది. మరికొన్ని బ్యాంకులు కూడా సహా రుణ వితరణ విధానం అనుసరించాలని భావిస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here