ప్రీపెయిడ్ యూజర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్! రూ.4 లక్షల జీవిత బీమా…

0
4


ప్రీపెయిడ్ యూజర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్! రూ.4 లక్షల జీవిత బీమా…

రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికాం రంగంలో టారిఫ్‌ వార్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్ నడుమే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లు, ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి.

తాజాగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రూ.599తో రీచార్జ్ చేసుకుంటే రూ.4 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చేరి‌లో అమలులో ఉన్న ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రాబోయే కొన్ని నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ వర్తించనుంది.

ఏమిటీ ఈ రూ.599 ప్లాన్…?

గతంలో కూడా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.249 రీఛార్జ్ ద్వారా రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని అందించింది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూ.599 ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటాతోపాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీంతో పాటు రూ.4 లక్షల జీవిత బీమా కూడా లభిస్తుంది ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.

భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్‌ భాగస్వామ్యంతో...

భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్‌ భాగస్వామ్యంతో…

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ కోసం భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీలో భారతీ గ్రూప్ వాటా 51 శాతం కాగా, 49 శాతం ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆక్సా కలిగి ఉంది. దీంతో ఇప్పుడు ఎయిర్‌టెల్ మొబైల్ రీఛార్జ్‌తో కూడా జీవిత బీమా లభిస్తోంది.

ఈ జీవిత బీమా పొందడం ఎలాగంటే...

ఈ జీవిత బీమా పొందడం ఎలాగంటే…

ఎయిర్‌టెల్ అందించే ఈ జీవిత బీమా 18-54 వయసున్న ప్రీపెయిడ్ వినియోగదారులు అందరికీ లభిస్తుంది. దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా వైద్య పరీక్షల గొడవ కూడా ఉండదు. ఈ ఆఫర్ పొందాలంటే మొదట రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రూ.4 లక్షల జీవిత బీమా కోసం ఎస్సెమ్మెస్ ద్వారా కానీ, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కానీ, ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా కానీ ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆటోమేటిక్ రెన్యువల్, డిజిటల్ సర్టిఫికెట్...

ఆటోమేటిక్ రెన్యువల్, డిజిటల్ సర్టిఫికెట్…

ఒకసారి రూ.రూ.599తో రీచార్జ్ చేయించుకున్న తర్వాత లభించే ఈ జీవిత బీమా.. ఆ తరువాత నుంచి రీచార్జ్ చేసిన ప్రతిసారీ దానంతట అదే రెన్యువల్ అవుతుంది. అలాగే జీవిత బీమాకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా డిజిటల్ రూపంలో డెలివరీ అయిపోతుంది. అవసరం అనుకుంటే ఫిజికల్‌గా కూడా ఓ సర్టిఫికెట్‌ ఇంటి అడ్రస్‌కు వస్తుంది.

90 శాతం మందికి మొబైల్స్, కానీ...

90 శాతం మందికి మొబైల్స్, కానీ…

ప్రస్తుతం దేశంలోని మొత్తం జనాభాలో 90 శాతం మంది మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇక 2022 నాటికి దేశంలో మొబైల్ వినియోగించేవారి సంఖ్య 830 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అయితే జీవిత బీమా చేయించుకున్న వారి సంఖ్య మాత్రం 4 శాతం లోపే ఉంటోంది. ఎయిర్‌టెల్ కన్ను సరిగ్గా దీనిపైనే పడింది. దీంతో సంస్థ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది.

‘‘కనెక్టివిటీతోపాటు జీవితానికి భద్రత..''

‘‘కనెక్టివిటీతోపాటు జీవితానికి భద్రత..”

వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు మరిన్ని సదుపాయాలు అందించే విషయంలో ఎయిర్‌టెల్ ఎప్పుడూ ముందే ఉంటుందని, తాజా ప్లాన్‌తో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జీవిత భద్రత కూడా కలుగుతుందని భారతీ ఎయిర్‌టెల్ కేరళ మరియు తమిళనాడు హబ్ సీఈవో మనోజ్ మురళి వ్యాఖ్యానించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here