ప్రైవేటు ఆసుపత్రులు 24 గంటలు బంద్‌

0
1


ప్రైవేటు ఆసుపత్రులు 24 గంటలు బంద్‌

అత్యవసర సేవలు సైతం నిలిపివేత

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాలంటూ మరోసారి 24 గంటల పాటు ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌ పాటించేందుకు ఐఎంఏ సిద్ధమైంది. ఇప్పటికే రెండు సార్లు ప్రైవేటు ఆసుపత్రులను మూసేశారు. తాజాగా గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బంద్‌ పాటిస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షురాలు కవితారెడ్డి తెలిపారు. ఈ సారి ఓపీతో పాటు అత్యవసర సేవలు సైతం పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్‌ఎంసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, లేదంటే ఐఎంఏ మరింత కఠినమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. జూడాలు సైతం ఎన్‌ఎంసీని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. గురువారం నుంచి వరుసగా జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట ధర్నాలు చేయనున్నట్లు నిజామాబాద్‌ జూడా అసోసియేషన్‌ అధ్యక్షుడు దినేష్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో హౌజ్‌సర్జన్లు, పీజీలు, వైద్యవిద్యార్థులు ప్రతి ఒక్కరు రోజూ నిరసనలో పాల్గొంటారని తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here