ప్రొఫెషనల్ పుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉరుగ్వే స్టార్ ప్లేయర్

0
1


హైదరాబాద్: ప్రొఫెషనల్ పుట్‌బాల్‌కు ఉరుగ్వే ఫార్వర్డ్ ప్లేయర్ డియెగో ఫోర్లాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం తన ట్విట్టర్‌లో “21 ఏళ్ల తర్వాత నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నా కెరీర్‌ను ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. ఒక అందమైన వేదిక గొప్ప జ్ఞాపకాలు, భావోద్వేగాలతో నిండి ఉంటుంది, కానీ మరొక కొత్త సవాళ్లు ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ఒక విధంగా లేదా మరొక విధంగా నాతో పాటు వచ్చిన అందరికీ ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్ లీగ్‌లో బాబర్ ఆజాం విజృంభణ.. దెబ్బకు వెబ్‌సైట్ క్రాష్ అయింది

40 ఏళ్ల డియెగో ఫోర్లాన్ మాంచెస్టర్ యునైటెడ్, అట్లెటికో మాడ్రిడ్, ఇంటర్ మిలాన్, విల్లారియల్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఉరుగ్వే జాతీయ జట్టు తరుపున 112 మ్యాచ్‌ల్లో పాల్గొన్న డియెగో ఫోర్లాన్ 36 గోల్స్ కొట్టాడు. 2011లో ఉరుగ్వే కోపా అమెరికా టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.

2010 పుట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డెన్ బాల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఉరుగ్వే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. డియెగో ఫోర్లాన్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను అర్జెంటీనాలోని ఇండిపెండెంట్ క్లబ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత 2002లో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు మూవ్ అయ్యాడు.

1st ODI: మ్యాచ్ డిటేల్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ గణాంకాలివే!

2002-03 సీజన్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ప్రీమియర్ లీగ్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, లాలిగా టోర్నీలో పలు జట్ల తరుపున ఆడిన డియెగో ఫోర్లాన్ మొత్తం 240 లీగ్ గేమ్స్‌లో 128 గోల్స్ చేశాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here