ప్లాస్టిక్‌ అంతానికి ప్రతిన బూనాలి

0
1


ప్లాస్టిక్‌ అంతానికి ప్రతిన బూనాలి

వ్యక్తి పరివర్తనే ముఖ్యం

పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు

‘ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్‌’ ఆధ్వర్యంలో సదస్సు

 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగర బృందం

ప్రతిజ్ఞ చేస్తున్న పాలనాధికారి, కార్పొరేషన్‌ కమిషనర్‌, మెప్మా పీడీ, జిల్లా సైన్స్‌ అధికారి తదితరులు

‘‘ప్లాస్టిక్‌.. పర్యావరణానికి పెను ముప్పుగా మారింది.. ఈ రక్కసిని పారదోలేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి.. చిన్న, పెద్ద ఇందుకు ప్రతిన బూనాలి. అధికారులెన్ని ఆదేశాలిచ్చినా వ్యక్తి పరివర్తనే ముఖ్యమని’’ జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. ‘ప్లాస్టిక్‌ అంతం- అందరి పంతం నినాదం’తో ‘ఈనాడు-ఈటీవీ, తెలంగాణ-ఈటీవీ భారత్‌’ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి ఇంటా ఉదయం లేచింది మొదలు ప్లాస్టిక్‌ వినియోగం తప్పనిసరైందని పాలనాధికారి అన్నారు. ప్రతి గృహిణి ధోరణి మార్చుకోవాలి. సరకులు, కూరగాయలు ఇలా ఎక్కడికి వెళ్లినా.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతకాలన్నారు. అప్పుడే ప్లాస్టిక్‌ భూతం మనందరి నుంచి దూరమవుతుందని వివరించారు. దాని నిర్మూలనకు తామంతా కృషి చేస్తామని సదస్సులో ప్రతినబూనారు. జిల్లా పాలనాధికారితో పాటు వేదికపై ఉన్న అధికారులు, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ‘నేను సైతం ప్లాస్టిక్‌ రక్కసిని అంతం కోసం సైనికుడిగా పోరాడుతానని’ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, మెప్మా పీడీ రాములు, ఈనాడు నిజామాబాద్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస చక్రవర్తి తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here