ప్లాస్టిక్‌ నియంత్రణే లక్ష్యం

0
0


ప్లాస్టిక్‌ నియంత్రణే లక్ష్యం

పాలనాధికారి సత్యనారాయణ
ప్లాస్టిక్‌ తీసుకొని గుడ్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ప్లాస్టిక్‌ నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని పాలనాధికారి సత్యనారాయణ సూచించారు. రెండు కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలకు ఆరు గుడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతీ గ్రామంలో ఎంపిక చేసిన కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్‌ ఇచ్చి గుడ్లను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పెద్ద గ్రామాల్లో రెండు, మండల కేంద్రాల్లో నాలుగు నుంచి ఐదు , మున్సిపాలిటీల్లో ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రించడానికి ఒక వైపు నజరానా ప్రకటిస్తూనే మరో వైపు జరిమానాలు కూడా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకాధికారి(స్పెషల్‌ కలెక్టర్‌) వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో చేరి వారికి భద్రత కల్పించాలి

కామారెడ్డి పట్టణం : విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి భద్రత కల్పించాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలో, బస్టాండులో పరిస్థితులపై ఆరా తీశారు. ఏయే మార్గాల్లో బస్సుల రాకపోకలు సాగుతున్నాయో అధికారులను ప్రశ్నించారు. మంగళవారం నుంచి విధుల్లో చేరే డ్రైవర్లు, కండక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీవీఎం గణపతిరాజ్‌, డీఎం ఆంజనేయులు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌ తదితరులున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here