ప్లాస్టిక్‌ నిర్మూలనకు చర్యలు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీర్లు శానిటేషన్‌ అధికారులతో నగర పరిశుభ్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని వ్యాపార వాణిజ్య దుకాణాలలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడుతున్నారని, నేపథ్యంలో వారిపై చివరి హెచ్చరిక జారీ చేసి పునరావతం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌ నివారణకు క్రమం తప్పకుండా ప్రతి రోజు నిఘా పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాల్వలను పరిసరాలను శుభ్రంగా చేయాలని వీధుల్లో అక్కడక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటిటికి వెళ్లి సేకరించే సందర్భంలో అక్కడికక్కడే పొడి తడి చెత్త వేర్వేరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైంటిఫిక్‌ డంపు యార్డు ఏర్పాటు, మునిసిపాలిటీ ఇంజనీర్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సమన్వయంతో అక్రమ కట్టడాలు తొలగించిన అక్కడ ఏర్పడిన వ్యర్థ పదార్థాలను వెంటేనే తొలగించాలన్నారు సిటీ శానిటేషన్‌ ప్లాన్‌ తయారుచేసి వెంటనే నివేదించాలని ఆదేశించారు ఇంకా మిగిలిపోయిన గహాలకు చెత్త కుండి సరఫరా చేయాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here