ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి రాజీవ్‌ నగర్‌ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలను పూర్తిచేయాలని ఎంపిక పూర్తయిన తర్వాత గ్రామాల్లో ప్రతి వాడలో తిరిగి అక్కడున్న సమస్యలను గుర్తించాలని, అదేవిధంగా చెత్తా చెదారాన్ని మురుగు కాలువల పరిశుభ్రంగా ఉంచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించి పరిశుభ్రమైన గ్రామంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం గ్రామస్తులందరి సహకారం తీసుకోవాలన్నారు. చెత్తను ప్లాస్టిక్‌ బయట పడకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ కష్ణను కోరారు. కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎంపిక చేశారా అని సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శి రెండు గ్రామాలకు ఒక్కరే ఉన్నందున మధ్యాహ్నం ఎంపిక చేసుకుంటామని సర్పంచ్‌ కలెక్టర్‌కు వివరించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here