ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

0
4


ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

కార్యదర్శితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు

మంగళ్‌పాడ్‌(ఎడపల్లి), న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు పిలుపునిచ్చారు. ఎడపల్లి, మంగళ్‌పాడ్‌, నెహ్రూనగర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న 30 రోజుల ప్రణాళిక పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఎడపల్లిలో ప్లాస్టిక్‌ పేరుకుపోవడంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ వస్తువులను వేయడానికి ప్రత్యేక డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సంతరించుకోవాలని చెప్పారు. పవర్‌ వీక్‌లో భాగంగా వీధి దీపాల కోసం థర్డ్‌ లైన్‌ తీగలను ఏర్పాటు చేయాలని, వంగిపోయిన స్తంభాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు సూచించారు. వాగులు, చెరువులు పొంగిపొర్లుతూ అలుగులు పారుతున్నాయన్నారు. ప్రజలు వాటిని చూసేందుకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ తదితర శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

నేడు ప్రత్యేక ప్రణాళికపై సమీక్ష

కలెక్టరేట్‌(నిజామాబాద్‌): ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికపై సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమీక్షకు అధికారులు హాజరు కావాలన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here