ప్లాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు

0
1


ప్లాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు

మైలారంలో గుడ్లు అందజేస్తున్న సర్పంచి యశోద

బాన్సువాడ, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు తప్పవని పుర కమిషనర్‌ కుమారస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని పలు దుకాణాల్లో మంగవారం సాయంత్రం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. జరిమానాలు విధించారు. ప్లాస్టిక్‌ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

నస్రుల్లాబాద్‌: కిలో ప్లాస్టిక్‌ వస్తువులు సేకరించి తెస్తే మూడు కోడిగుడ్లు ఇస్తామని సర్పంచులు యశోద, అంజయ్య పేర్కొన్నారు. మైలారం, హజీపూర్‌ గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

వీరాపూర్‌(బీర్కూర్‌): ప్లాస్టిక్‌ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచి సాయిరాం పేర్కొన్నారు. మండలంలోని వీరాపూర్‌ గ్రామంలో మంగళవారం ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి హరీష్‌, ఉపసర్పంచి గంగారాం, తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here