ప్లాస్టిక్ కవర్లో కుర్చొని, నదికి ఎదురీదుతూ.. విద్యార్థుల సాహసం

0
0


క్కడ స్కూల్‌కు వెళ్లాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాలి. ప్లాస్టిక్ కవర్లలో కుర్చొని నదీ ప్రవాహానికి ఎదురీదాలి. ఇది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదు.. రోజూ ఈ సాహసం చేయాలి. అదృష్టం బాగుంటే క్షేమంగా ఒడ్డుకు చేరుతారు. లేదంటే.. పైలోకానికే. ఇది వింటేనే బాబోయ్ అనిపిస్తుంది. మరి.. స్వయంగా అనుభవిస్తున్న ఆ చిన్నారుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది?

చిన్నారుల్లో కొందరు స్కూల్‌కు వెళ్లమని మారం చేస్తారు. ఎండలు, చలి, వర్షం ఎక్కువగా ఉంటే డుమ్మ కొట్టేస్తారు. కానీ, వియత్నాంలోని డీన్ బీన్‌లోని హువోయి హా గ్రామానికి చెందిన విద్యార్థులు మాత్రం అలా కాదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్కూలుకు వెళ్తూ విద్యకు విలువిస్తున్నారు. ప్రమాదమని తెలిసి కూడా చదువు కోసం నదీ ప్రవాహాన్ని దాటి మరీ స్కూల్‌కు వెళ్తున్నారు. ఇదివరకు గ్రామస్తులంతా కలిసి కర్రల వంతెన ఏర్పాటు చేసుకున్నారు.

అయితే, వరదల సమయంలో అది కొట్టుకుపోవడంతో వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పను ఉపయోగిస్తున్నారు. అయితే, వరద సమయంలో దాని ప్రయాణం మరింత కష్టం. దీంతో ప్రత్యామ్నయ మార్గాన్ని అన్వేషించారు. నదీ ప్రవాహానికి ఎదురీదగల బలమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. స్కూల్ యూనిఫాం తడవకుండా విద్యార్థులను నదిని దాటించడం చాలా కష్టం. దీంతో ఆ వ్యక్తి ఓ ప్లాస్టిక్ సంచిలో విద్యార్థులను కుర్చోబెట్టి నది ఈదుతూ అవతలి ఒడ్డుకు చేరుస్తున్నాడు. ఇలా రోజుకు 50 మంది విద్యార్థులను నది దాటిస్తున్నాడు.

‘‘కవర్లో కుర్చొని నదిని దాటేందుకు చిన్నారులు చాలా భయపడతారు. వేరే మార్గం లేకపోవడంతో ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. అక్కడ నది ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా అందులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది’’ అని స్థానికులు తెలిపారు. హువోయి హా గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. ఇదివరకు మా బంధువు ఒకరు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్ప మీద నది దాటించేవాళ్లం. ఇప్పుడది ఉపయోగించడం లేదు. ప్రభుత్వం మా కష్టాలు తెలుసుకుని వంతెన నిర్మిస్తుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు. వీరి కష్టాలను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆ గ్రామస్తులకు తగిన సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించింది.
వీడియో:



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here