ప్లాస్టిక్ షార్ట్స్.. ఈ నిక్కర్లు వేసుకున్నా, వేసుకున్నట్లు ఉండవు!

0
0


ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తే ఎలాంటి ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయో చెప్పేందుకు ఇదిగో ఈ పొట్టి నిక్కర్లే నిదర్శనం. ఈ నిక్కర్లను ధరించే వ్యక్తికి వాటిని వేసుకున్న ఫీలింగైతే కలగవచ్చు. కానీ, చూసేవారు మాత్రం షాకవ్వడం ఖాయం. ఎందుకంటే.. అవి పాదర్శకమైన ప్లాస్టిక్‌‌తో తయారు చేసిన నిక్కర్లు కాబట్టి.

బెర్లిన్ వాటర్‌ప్రూఫ్ ట్రాన్సపరెంట్ షార్ట్స్‌గా పిలిచే ఈ షార్టులను మేవ్రిక్ స్విమ్ వేర్ సంస్థ తయారు చేసింది. స్విమ్మింగ్ చేసేవారు లేదా బీచ్‌లో విహరించేవారికి ఈ షార్ట్‌లు ఉపయోగపడతాయని ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో సోషల్ మీడియాలో ఈ నిక్కర్లపై పెద్ద చర్చే జరుగుతోంది. అవి వేసుకున్నా ఏం లాభం? లోపలవన్నీ కనిపిస్తాయిగా అని కామెంట్లు చేస్తున్నారు. అదేదో రంగుల్లో విడుదల చేయొచ్చు కదా, మరీ పారదర్శకంగా ఎందుకు తయారు చేశారని ప్రశ్నిన్నారు. అలా రంగుల్లోనే చేసి ఉంటే.. ఆ ఉత్పత్తి ఇలా వైరల్ అయ్యేదా చెప్పండి! ఇంతకీ వీటి ధరెంతో తెలుసా? జస్ట్ రూ.1925 మాత్రమే!!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here