ప‌వన్ క‌ళ్యాణ్ టార్గెట్ ఫిక్స్‌: జ‌గ‌న్ పాల‌న పైన జ‌న‌సేనాని అంచ‌నాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!

0
2


ప‌వన్ క‌ళ్యాణ్ టార్గెట్ ఫిక్స్‌: జ‌గ‌న్ పాల‌న పైన జ‌న‌సేనాని అంచ‌నాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!

జ‌న‌సేన అధినేత ఎన్నిక‌ల్లో ఓటమి పైన ఆలోచ‌న కంటే..భ‌విష్య‌త్ మీదే దృష్టి పెట్టారు. జ‌రిగిన న‌ష్టం కంటే..జ‌ర‌గాల్సి న మేలు పైనే ఆలోచ‌న చేస్తున్నారు. అందులో భాగంగా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నా రు. ఓట‌మి గురించి ఆవేద‌న‌లో ఉన్న పార్టీ శ్రేణుల‌కు దైర్యం చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు తాను ఎక్క‌డై తే ఓడారో..అక్క‌డే ప‌ర్య‌ట‌న చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా ఈ నెల 4,5 తేదీల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని రెండు పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌లు..కార్య‌క‌ర్త‌ల తో స‌మావేశం కానున్నారు.

4,5 తేదీల్లో ప‌వ‌న్ ప‌శ్చిమ ప‌ర్య‌ట‌న‌..

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాన్ ఈ నెల 4,5 తేదీల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఉభయ గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంద‌రూ అంచ‌నా వేసారు. ఆ జిల్లాలో ప‌వ‌న్ స‌భ‌ల‌కు వ‌చ్చిన స్పంద‌న చూసిన వారు సైతం ఇదే ఆశ‌తో క‌నిపించారు. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇదే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం నుండి పోటీ చేయ‌గా..ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు న‌ర్సాపురం లోక్‌స‌భ స్థానానికి పోటీ చేసారు. ఊహించ‌ని విధంగా ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. న‌ర్సాపురం అసెంబ్లీ స్థానం పైన జ‌నసేన గెలుపు ఖాయ మ‌నే ఆశ‌లు పెట్టుకుంది. కానీ, కేవ‌లం ఒకే సీటు అది కూడా తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజోలు నుండి మాత్ర‌మే గెలుపొందింది. అయినా..ఇప్పుడు ప‌వ‌న్ కొత్త నినాదం తెర మీద‌కు తెచ్చారు. ఎక్క‌డైతే ఓడామో..అక్క‌డే స‌మీక్ష చేసుకొని తిరిగి నిల‌బ‌డాల‌ని పార్టీ నేత‌ల‌కు ప‌వ‌న్ సూచిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసారు.

 ప‌వ‌న్ అస‌లు ల‌క్ష్యం అదే...

ప‌వ‌న్ అస‌లు ల‌క్ష్యం అదే…

ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ప‌లితాలు పూర్తిగా వ్య‌తిరేకంగా ఉన్నా..రెండు నెల‌ల లోపే ప‌వ‌న్ తిరిగి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. దీని ద్వారా తాను ఓడినా ప్ర‌జ‌ల‌తోనే ఉంటాన‌ని బ‌ల‌మైన సంకేతాలు ఇవ్వ‌ట‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప‌వ‌న్ వ్యూహాలు సిద్దం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు..మున్పిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆల‌స్యంగా అయినా ఇప్ప‌టికే పార్టీ పాలిట్ బ్యూరో..పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీల‌ను ప‌వ‌న్ నియ‌మించారు. ఇక‌, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా క‌మిటీల‌ను ఏర్పాటు చేసి కేడ‌ర్‌ను స్థానిక ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయాల‌నేది ప‌వ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. స్థానికంగా పార్టీని బ‌లోపేతం చేసుకుంటే..భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు మేలు చేస్తుంద‌ని ఆశిస్తున్నారు. ఇక వైపు టీడీపీ క్షేత్ర స్థాయిలో బ‌ల హీన ప‌డుతున్న వేళ‌..తాము బ‌ల‌ప‌డ‌టానికి ఇది స‌రైన స‌మ‌యంగా ప‌వ‌న్ భావిస్తున్నారు.

వైసీపీ వ్య‌తిరేక‌త తాను ఓన్ చేసుకోవాల‌ని..

వైసీపీ వ్య‌తిరేక‌త తాను ఓన్ చేసుకోవాల‌ని..

జ‌గ‌న్ రెండు నెల‌ల పాల‌న పైన అనేక వ‌ర్గాలు అసంతృప్తితో ఉన్నాయ‌ని ప‌వ‌న్ అంచ‌నా వేస్తున్నారు. దీంతో తొలుత వంద రోజుల వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇస్తున్నామ‌ని చెప్పిన ప‌వ‌న్‌..ఇప్ప‌టికే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అమ‌లు చేయ‌లేని హామీల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అదే విధంగా ఇసుక కొర‌త గురించి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. మ‌రోవైపు టీడీపీ ఇప్ప‌టికిప్పుడు కోలుకొనే స‌మ‌యం లేక‌పోవ‌టంతో త‌మ‌కు ఉన్న అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప‌వ‌న్ గ‌ట్టిగా నిర్ణ‌యించారు. ఇందులో భాగంగానే.. ప్ర‌ధానంగా త‌మ ఓటు బ్యాంకు ఇప్ప‌టికీ బ‌లంగా క‌నిపిస్తున్న గోదావ‌రి జిల్లాల పైనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్ చేసారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here