ఫన్నీ వీడియో: ఒకే వ్యక్తిని రెండు సార్లు స్కూటర్‌తో గుద్దిన యువతి

0
2


టైం బాగోపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని అంటారు. ఒక్కోసారి మనం రోడ్లపై ఎంత జాగ్రత్తగా వెళ్లినా.. ఎవరో ఒకరు వచ్చి గుద్దేసి వెళ్లిపోతారు. ఇదిగో ఈ కింది వీడియోలో ఉన్న వ్యక్తికి కూడా అదే జరిగింది. ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటుతున్న అతన్ని ఓ మహిళ స్కూటర్‌పై వెనకాల నుంచి ఢీకొట్టింది. అతడు కోపంగా ఆమె వైపు చూడటం సారీ చెప్పి తప్పించుకుంది.

దీంతో ఆ వ్యక్తి ఆమెను ఏమీ అనకుండా మళ్లీ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆమె కూడా స్కూటర్‌తో యూటర్న్ తిరగబోయింది. ఈ సారి మరింత గట్టిగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం ఆ వ్యక్తి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ జాలి కలుగుతుంది. అదే సమయంలో ఆమె స్కూటర్ నడుపుతున్న తీరు చూసి నవ్వు వస్తుంది.

వీడియో:

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here