ఫార్మాలో అత్యధిక శాలరీ హైదరాబాదీదే.. రూ.59 కోట్లు! దిలీప్ వేతనం ఒక్కరూపాయే

0
1


ఫార్మాలో అత్యధిక శాలరీ హైదరాబాదీదే.. రూ.59 కోట్లు! దిలీప్ వేతనం ఒక్కరూపాయే

హైదరాబాద్: ఇండియన్ ఫార్మా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు ఎవరో తెలుసా? హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఔషద తయారీ సంస్థ దివిస్ ల్యాబ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కే దివి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్‌లోనే (ఫార్మా) అత్యధికంగా రూ.58.8 కోట్లు తీసుకున్నారు. దివిస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం మురళీ దివి అంతకుముందు ఏడాది కంటే 46.3 శాతం పెరిగింది. వేతనం, కమీషన్ కలిపి ఆయన దాదాపు 59 కోట్లు తీసుకున్నారు.

రూ.59 కోట్లలో కమీషన్స్ ద్వారానే రూ.57.61 కోట్లు

మురళీ దివి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కమీషన్స్ ద్వారానే మొత్తం రూ.57.61 కోట్లు అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.39 కోట్లు, కమీషన్ కలుపుకొని రూ.40.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్వీ రమణ రూ.30 కోట్లు అందుకున్నారు. మురళీ దివి తనయుడు కిరణ్ ఎస్ దివి (హోల్ టైమ్ డైరెక్టర్) గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారు.

3.96 శాతం పెరిగిన ఉద్యోగుల వేతనం

3.96 శాతం పెరిగిన ఉద్యోగుల వేతనం

2019 ఆర్థిక సంవత్సరంలో సంస్థలోని ఉద్యోగుల వేతనంలో పెరుగుదల సరాసరి 3.96 శాతం. ఈ డ్రగ్ మేకర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT-ట్యాక్స్ కట్టిన తర్వాత లాభం) రూ.1,333 కోట్లుగా ఉంది. రెవెన్యూ రూ.5,036 కోట్లు.

దిలీప్ శాంఘ్వీ... ఒక్కరుపాయి వేతనం

దిలీప్ శాంఘ్వీ… ఒక్కరుపాయి వేతనం

మిగతా ఫార్మాల విషయానికి వస్తే దేశంలోని అతిపెద్ద ఔషద సంస్థ సన్ ఫార్మాస్యుటికల్స్ ఫౌండర్, ఎండీ దిలీప్ శాంఘ్వీ గత ఏడాదికి గాను ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకున్నారు. అయితే ప్రోత్సాహకాల కింద రూ.2,62,800 అందుకున్నారు.

అరబిందో గోవిందరాజన్ వేతనం రూ.14.6 కోట్లు

అరబిందో గోవిందరాజన్ వేతనం రూ.14.6 కోట్లు

దేశంలోని రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవిందరాజన్ రూ.14.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ పారితోషికంలో వేతనం, భత్యాలు, నికర లాభంలో ఒక్క శాతం వరకు కమీషన్ ఉన్నాయి. అరబిందో ఫార్మా PAT రూ.19,564 కోట్ల రెవెన్యూ పైన రూ.2,356 కోట్లుగా ఉంది.

రెడ్డీస్ జీవీ ప్రసాద్ వేతనం రూ.12.4 కోట్లు

రెడ్డీస్ జీవీ ప్రసాద్ వేతనం రూ.12.4 కోట్లు

డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో జీవీ ప్రసాద్ రూ.12.4 కోట్లు (2018-19) అందుకున్నారు. అంతకుముందు ఏడాది (2017-18) ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఎరేజ్ ఇజ్రాయెల్ నుంచి బాధ్యతలు స్వీకరించిన జీవీ ప్రసాద్ రూ.7.75 కోట్లు తీసుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ PAT రూ.15,400 కోట్ల రెవెన్యూ పైన రూ.1,880 కోట్లుగా ఉంది.

తగ్గిన సిప్లా ఎండీ వేతనం

తగ్గిన సిప్లా ఎండీ వేతనం

సిప్లా లిమిటెండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉమాంగ్ వోహ్రా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15.03 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. 2017-18లో అతను రూ.18.85 కోట్లు అందుకోగా, గత ఏడాది 20.23 శాతం తక్కువగా అందుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here