ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ: జేపీ డుమినీ విశ్వరూపం.. 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (వీడియో)

0
1


హైదరాబాద్: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్‌ జేపీ డుమినీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ సీపీఎల్‌లో రికార్డు నెలకొల్పాడు. 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి.. సీపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని నమోదు చేసాడు. మొత్తంగా 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

హెచ్‌సీఏ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న వీవీఎస్ లక్ష్మణ్

10 బంతుల్లో 47 పరుగులు:

10 బంతుల్లో 47 పరుగులు:

సీపీఎల్‌లో భాగంగా బార్బోడాస్‌ ట్రిడెంట్స్‌, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ట్రిడెంట్స్‌ జట్టు తరఫున ఆడుతున్న డుమినీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు ఆడిన డుమినీ.. ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి మిగతా 47 పరుగుల్ని మరో 10 బంతుల్లో చేసాడు.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ:

సిక్సర్ల మోత మోగించిన డుమినీ సీపీఎల్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించున్నాడు. అంతకుముందు విండీస్ ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌పై ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు ఉంది. ఈ నెల ఆరంభంలో లూయిస్‌ 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించగా.. డుమినీ ఆ రికార్డుని బ్రేక్‌ చేశాడు. అయితే ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు మాత్రం టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు.

చివరి బంతికి సిక్సర్:

చివరి బంతికి సిక్సర్:

ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ట్రిడెంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. డుమినీకి తోడు చార్లెస్‌ (58), కార్టర్‌ (51)లు కూడా చెలరేగారు. చార్లెస్‌, కార్టర్‌ జోడి 14 ఓవర్లలో 110 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన డుమినీ.. నైట్‌రైడర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక రేమోన్ రీఫెర్ చివరి బంతిని సిక్సర్ కొట్టి అభిమానులను అలరించాడు.

ఐదు వికెట్లతో చెలరేగిన వాల్ష్‌:

ఐదు వికెట్లతో చెలరేగిన వాల్ష్‌:

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దాంతో బార్బోడాస్‌ 63 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ట్రిడెంట్స్‌ బౌలర్ హేడన్‌ వాల్ష్‌ ఐదు వికెట్లతో రాణించాడు. డుమినీ రెండు వికెట్లు తీసాడు. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో డారెన్‌ బ్రేవో (28) టాప్ స్కోరర్. బ్యాట్, బంతితో రాణించిన డుమినీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here