ఫైర్ యాక్సిడెంట్ : అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరికీ సీరియస్

0
3


ఫైర్ యాక్సిడెంట్ : అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరికీ సీరియస్

అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు నాలుగు, ఐదో అంతస్తుల్లో చెలరేగాయి. స్థానికి మీడియా సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. 30 మందిని రక్షించామని గుజరాత్ పోలీసులు తెలిపారు. అయితే వారిలో ఇద్దరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని వివరించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని .. కానీ వారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లోని గణేశ్ భవన సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ బహుళ అంతస్తుల భవనం ఎస్‌జీ రహదారిపై ఉంది. ఈ దారి అహ్మదాబాద్‌ను గాంధీనగర్‌ను కలుపుతుంది. ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. భవనంలో పొగచూరి మంటలు వస్తున్నాయని స్థానిక మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకొన్న స్థానికులను కాపాడారు. అయితే మంటలు ఎగిసిపడటంతో .. అందులో చిక్కుకున్న వారిని తరలించేందుకు హైడ్రాలిక్ లాడర్ ఉపయోగించారు.

ఘటనాస్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు వ్యాపించినట్టు గుర్తించి సహాయ చర్యలు చేపట్టారు. వెంటనే భవనంలోకి ప్రవేశించి దాదాపు 30 మందిని కాపాడారు. అయితే అప్పటికే పొగచూరి ఊపిరాడక స్థానికులు ఇబ్బంది పడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందనని డాక్టర్లు చెప్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here