ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్Xఅమెజాన్ ప్రైమ్ డే సేల్: కళ్లు చెదిరే ఆఫర్లు

0
1


ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్Xఅమెజాన్ ప్రైమ్ డే సేల్: కళ్లు చెదిరే ఆఫర్లు

ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వినియోగాదారులకు బంపరాఫర్స్ ప్రకటించాయి. ప్రైమ్ డే సేల్ పేరుతో అమెజాన్, బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 15, 16 తేదీల్లో ఉండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 15 నుంచి 18 మధ్య ఉంది. స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం ప్రత్యేక సేల్‌ను ఈ రోజు నుంచి ప్రారంభించింది. దీనికి తోడు SBI కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. రియల్ మి, నోకియా స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్స్, కంప్యూటర్ల్, టీవీ వంటివి తగ్గింపు ధరల్లో రానున్నాయి. షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ (3GB, 32GB) ఫోన్ రూ.10,999గా ఉంది. ఆఫర్‌లో దీనిని రూ.9,999కి ఇస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 3 (64GB) MRPS రూ.71,000. ఆఫర్లో ఇది రూ.49,999కు రానుంది. పిక్సెల్ 3ని కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌కు గూగుల్ హోమ్ మినీని పొందవచ్చు. హానర్, రియల్ మి, మోటరోలా, వివో ఫోన్లు కూడా మంచి ఆఫర్‌కు లభిస్తున్నాయి.

భారీ ఆఫర్లు

భారీ ఆఫర్లు

రూ.40,900 విలువ కలిగిన 40mm వేరియంట్ ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఆఫర్లో రూ.34,900కు వస్తోంది. రూ.4,999 విలువ కలిగిన గూగుల్ హోమ్ మినీ రూ.2,499కు వస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, గృహ ఉత్పత్తులు, ఫర్నీచర్ పైన 40-80 శాతం వరకు, పుస్తకాలు, బొమ్మలు, క్రికెట్ బ్యాగ్స్ వంటి వాటిపై 80 శాతం వరకు, వాషింగ్ మెషీన్లు, టీవీ, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులు, బూట్లపై 40 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ ప్రైమ్ డే సేల్

మరోవైపు, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. రూ.59,999 విలువ కలిగిన ఐపోన్ ఎక్స్ఆర్‌ను రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్‌పై రూ.7వేల వరకు తగ్గింపు ధర ఉంది. హువావే, హానర్, వన్ ప్లస్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. హానర్, వన్ ప్లస్, హువావే ఫోన్లపై రూ.10వేల నుంచి రూ.13వేల వరకు కూడా తగ్గింపు ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here