ఫ్లోరిడాలో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

0
2


హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టీ20కి సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని పలువురు యువ క్రికెటర్లకు ఈ సిరిస్‌లో సెలక్టర్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొల టీ20లో బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండే… బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది.

అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు ఈ టీ20ని ఫ్లోరిడాలో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 2016లో ఇక్కడ వెస్టిండిస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో వెస్టిండీస్‌ ఏకంగా 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (110) మెరుపు సెంచరీ సాయంతో భారత్‌ లక్ష్యానికి చేరువగా వచ్చింది కానీ.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం విండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ (105) పేరిట ఉంది. అయితే క్రిస్ గేల్ రికార్డుని బద్దలు కొట్టేందుకు రోహిత్ శర్మ మరో ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (101) మూడో స్థానంలో ఉండగా… మార్టిన్‌ గుప్టిల్‌(103) రెండో స్థానంలో ఉన్నాడు.

1
46244

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా వెస్టిండిస్‌తో నెల రోజుల పాటు సుదీర్ఘ సిరిస్‌లో తలపడనుంది. ఈ పర్యటనలో భాగంగా శనివారం, ఆదివారం జరగనున్న మొదటి రెండు టీ20లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి.

ఆగస్టు 6న జరిగే మూడో టీ20 గుయానాలో జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టు సిరిస్ జరగనుంది. విండిస్ పర్యటనకు సెలక్టర్లు ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. ధోనీ రెండు నెలలుపాటు ఆర్మీకి సేవలందించడం కోసం క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:

ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్

వెస్టిండీస్: ఎవిన్ లూయిస్‌, జాన్ క్యాంప్‌బెల్‌, షిమ్రాన్ హెట్‌మయెర్‌, నికోలస్ పూరన్‌, కీరన్ పొలార్డ్‌, రోవ్మెన్ పావెల్‌, కార్లోస్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కీమో పాల్‌, సునీల్ నరైన్‌, ఓషానే థామస్‌, షెల్డన్ కాట్రెల్‌.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here