బంగారు తెలంగాణే కాదు.. ఇది వజ్రాల తెలంగాణ..! లీడర్లు చెప్పింది కాదు.. ఇది నిజం..!!

0
0


బంగారు తెలంగాణే కాదు.. ఇది వజ్రాల తెలంగాణ..! లీడర్లు చెప్పింది కాదు.. ఇది నిజం..!!

హైదరాబాద్ : బంగారు తెలంగాణ అంటూ ఏ ముహుర్తాన అన్నారో కానీ.. అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాష్ట్రం గురించి ప్రస్తావన వస్తే చాలు.. “బంగారు తెలంగాణ” అనేది ఊతపదంలా వచ్చేస్తోంది. అయితే ఇప్పుడు బంగారు తెలంగాణే కాదు.. వజ్రాల తెలంగాణ అని కూడా ముద్ర పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదేదో రాజకీయ నేతలు చెబుతున్న విషయం కాదు. అక్షరాలా నిజమే కాబోతోంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో బంగారు గనులతో పాటు వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇక వాటిని వెలికితీయడమే తరువాయి బంగారు తెలంగాణ కల సాకారం కానుంది.

బంగారు తెలంగాణలో వజ్రాల నిక్షేపాలు..!

బంగారు తెలంగాణలో గోల్డ్ నిల్వలు బాగానే ఉన్నట్లు తేలింది. ఆరు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు మైనింగ్ శాఖ అధికారులు.

అదే క్రమంలో వజ్రాల నిక్షేపాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు పసిడి అన్వేషణ వేట ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ మైన్స్ తవ్వి బంగారు నిల్వల వెలికితీతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నల్గొండ, సూర్యాపేట, పాలమూరు, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గోల్డ్ మైన్స్‌తో పాటు డైమండ్ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.

 ఎన్‌ఎండీసీకి సమగ్ర సర్వే బాధ్యతలు

ఎన్‌ఎండీసీకి సమగ్ర సర్వే బాధ్యతలు

బంగారు గనులు, వజ్రాల నిక్షేపాలకు సంబంధించి తెలంగాణ గనుల శాఖ ఇటీవల ఒక రిపోర్ట్ తయారుచేసింది. అందులో బంగారు, వజ్రాల నిల్వలపై పలు అంశాలను పొందుపరచడమే గాకుండా ఫ్యూచర్‌లో తీసుకోబోయే కార్యక్రమాలను పేర్కొంది. ఈ నివేదిక ప్రకారమే తెలంగాణలోని ఆరు జిల్లాల్లో గోల్డ్ మైన్స్‌తో పాటు డైమండ్ నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలిసింది. దాంతో సమగ్ర సర్వే చేయాలంటూ ఎన్‌ఎండీసీకి బాధ్యతలు అప్పగించారు మైనింగ్ శాఖ అధికారులు. ఆ క్రమంలో బంగారం నిల్వలకు సంబంధించి తొలి దశ కింద వనపర్తి, గద్వాల జిల్లాల్లో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు.

 ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్

ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్

తెలంగాణ గనుల శాఖ సూచించిన మేరకు ఎన్‌ఎండీసీ అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ధారూర్‌తో పాటు ఆత్మకూరు ఏరియాలో డ్రిల్లింగ్ నిర్వహించినట్లు సమాచారం. అదలావుంటే ఆరు జిల్లాల్లో బంగారు, వజ్రాల నిల్వలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ.. ఎన్‌ఎండీసీ సమగ్ర సర్వే రిపోర్ట్ ఇచ్చాక గానీ అసలు విషయం బయటపడనుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ గనుల తవ్వకాలపై ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఆరు జిల్లాల్లో బంగారు గనులు, వజ్రాల నిక్షేపాలు..!

ఆరు జిల్లాల్లో బంగారు గనులు, వజ్రాల నిక్షేపాలు..!

ఆరు జిల్లాల్లో బంగారు గనులతో పాటు వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ.. ఏయే ప్రాంతాల్లో పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయనేది మాత్రం తెలియదు. అందుకే ఎన్‌ఎండీసీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ గనులు తవ్వితే వర్కవుట్ కానుందనే విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు మైనింగ్ అధికారులు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో తవ్వకాలు చేపట్టనున్నారు.

గనులు తవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని.. అందుకే ఆయా ప్రాంతాల్లో మైనింగ్ గనక చేస్తే ఎంత మేర పనికొచ్చే బంగారం బయటకు రానుందనే విషయంపై తవ్వకాలు ఆధారపడి ఉంటాయి. ఆ మేరకు క్వాలిటీ, ప్యూరిటీ పరీక్షలు కూడా చేయిస్తారు. తవ్వకాలు తదితర ఖర్చులు పోను వాల్యూ బేస్డ్ బంగారం వస్తేనే గనుల్లో నుంచి బంగారం వెలికితీస్తారు. లేదంటే లైట్‌గా తీసుకుంటారు.

లైమ్‌స్టోన్, బొగ్గు గనుల ద్వారా భారీ ఆదాయం..!

లైమ్‌స్టోన్, బొగ్గు గనుల ద్వారా భారీ ఆదాయం..!

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ రకాల మినరల్స్‌ను కూడా పూర్తిస్థాయిలో వెలికితీయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతో భారీ ఆదాయం సమకూర్చుకోవాలన్నది ప్లాన్. ఇప్పటికే లైమ్‌స్టోన్, బొగ్గు గనుల ద్వారా తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఆ క్రమంలో ముడిసరుకులను వెలికితీయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.

గతేడాది గనుల నుంచి ఎంత ఆదాయమంటే..!

గతేడాది గనుల నుంచి ఎంత ఆదాయమంటే..!

గత ఫైనాన్షియల్ ఇయర్‌లో గనుల నుంచి ప్రభుత్వానికి 4 వేల 848 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అందులో 2 వేల 400 కోట్ల రూపాయలు బొగ్గు గనుల నుంచి ఆదాయం లభించగా.. ఒక వేయి 557 కోట్లు ఇతర ఖనిజాల నుంచి సమకూరాయి. ఇక ఇసుక తవ్వకాలతో మిగతా ఆదాయం వచ్చింది. అయితే ఇప్పటివరకు బంగారం గనులతో పాటు వజ్రాల నిక్షేపాల నుంచి దమ్మిడి ఆదాయం లేదు. ఒకవేళ గనుల తవ్వకాల్లో నాణ్యత గల బంగారం, వజ్రాలు దొరికినట్లైతే ఇకపై బొగ్గును మించిన ఆదాయం రావడం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో బంగారు తెలంగాణే కాదు వజ్రాల తెలంగాణగా అవతరించనుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here