బంగ్లా ఆటగాళ్ల సాహసం: మాస్క్‌లు ధరించి అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్

0
2


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ టీ20 మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

అసలు, ఈ మ్యాచ్‌ జ‌రుగుతుందా లేదా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్న సమయంలో గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్‌ మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్‌ చేశారు. ప్రస్తుతం డిల్లీలో వాయు కాలుష్య స్థాయి మరింత పెరిగి గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. అయితే మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో కాలుష్య స్థాయి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

ముఖానికి మాస్క్‌లు ధ‌రించి

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ముఖానికి మాస్క్‌లు ధ‌రించి.. ప్లేయ‌ర్లు ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఢిల్లీలో కాలుష్యం త‌గ్గేంత వ‌ర‌కు ఎటువంటి మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించరాదని టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాలుష్య నియంత్ర‌ణ‌కు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తొలి టీ20 వేదికను మార్చాలని

తొలి టీ20 వేదికను మార్చాలని

ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తొలి టీ20 వేదికను చివరి దశలో మార్చాలని చూశారు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మ్యాచ్‌ను ఎట్టిప‌రిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గంగూలీ వివరణతో ఢిల్లీ టీ20 మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.

అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకే

అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకే

భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు బుధవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. తొలి టీ20 ఢిల్లీ వేదికగా జరుగుతుండగా… రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:

1st T20I – New Delhi (November 3) – 7:00 PM (IST)

2nd T20I – Rajkot (November 7) – 7:00 PM (IST)

3rd T20I – Nagpur (November 10) – 7:00 PM (IST)

1st Test – Indore (November 14-18) – 9:30 AM (IST)

2nd Test – Kolkata (November 22-26) – 9:30 AM (IST)

TV Channels: Star Sports Network

Live Streaming: HotStar.comSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here