బక్రీద్ పండుగకు జంతు బలి అవసరమా ? ముస్లీంకు మౌలానా కేఆర్. ఫిరింగి మనవి, నిషేధం !

0
1


బక్రీద్ పండుగకు జంతు బలి అవసరమా ? ముస్లీంకు మౌలానా కేఆర్. ఫిరింగి మనవి, నిషేధం !

న్యూఢిల్లీ: ముస్లీం సోదరులకు ఎంతో పవిత్రమైన బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పండుగ ఆగస్టు 12వ తేదీ జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా భారత ముస్లీం వ్యక్తిగత చట్టం బోర్డ్ (మండళి)కు చెందిన మౌలానా కేఆర్ ఫిరింగి మహాలి ముస్లీంలకు ప్రత్యేక మనవి చేశారు. బక్రీద్ కు జంతు బలి అవసరమా ? అని మౌలానా ప్రశ్నిస్తున్నారు.

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం తాను బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లీంలకు మనవి చేస్తున్నానని మౌలానా కేఆర్. ఫిరంగి మహాలి అన్నారు. ప్రభుత్వం ఏ ప్రాణి (జంతు బలి) బలి చెయ్యకూడదని చెబుతుందో దానిని గౌరవిద్దామని మౌలానా కేఆర్. ఫిరింగి మహాలి ముస్లీంలకు మనవి చేశారు.

జంతు బలి పేరుతో మూగప్రాణులను ఎందుకు బలి చేస్తున్నారని, మిఠాయి తిని సంతోషంగా బక్రీద్ పండుగ చేసుకుందామని, పండుగ రోజు సాటివాటికి మిఠాయిలు పంచుదామని మౌలానా కేఆర్. ఫిరంగి మహాలి ముస్లీం సోదరులకు మనవి చేశారు.

మౌలానా కేఆర్. ఫిరంగి మహాలి మనవికి అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా వారివారి సామార్థ్యాన్ని బట్టి జంతు బలి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని కొందరు అంటున్నారు. ఇప్పుడు ముస్లీంలు కొత్తగా జంతు బలి చెయ్యడం లేదు కదా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

బక్రీద్ పండుగ సందర్బంగా చట్టపరంగా జంతువులను తీసుకువెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కొందరు శాసన సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు లేఖ రాశారు.

మైసూరు నగరంలోని నరసింహరాజ ఒడయార్ నియోజక వర్గం ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు కొందరు శాసన సభ్యులు ప్రత్యేకంగా లేఖ రాశారు. సీఎంకు మనవి చేస్తూ రాసిన లేఖలో శాసన సభ్యులు ఎన్.ఎ. హ్యారీస్, నజీర్ అహమ్మద్, సీఎం. ఇబ్రహీం, రహీం ఖాన్ తదితరులు సంతకాలు చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here