బక్రీద్: యూపీ సీఎం ఊరిలో సల్మాన్ ఖాన్ మేక, రూ. 8 లక్షలు, ఫుడ్ చిప్స్, కాఫీ, డ్రై ఫ్రూట్స్!

0
1


బక్రీద్: యూపీ సీఎం ఊరిలో సల్మాన్ ఖాన్ మేక, రూ. 8 లక్షలు, ఫుడ్ చిప్స్, కాఫీ, డ్రై ఫ్రూట్స్!

లక్నో: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ఈద్ అల్ అద్హా అని కూడా పిలుస్తారు. ముస్లీం సోదరులు ఎంతో భక్తి శ్రద్థలతో బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. రంజాన్ లాగే బక్రీద్ రోజు ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు, నమాజ్ చేస్తారు. బక్రీద్ రోజు దానాలతో పాటు జంతువులను బలి ఇస్తారు. బక్రీద్ పండుగ సందర్బంగా సల్మాన్ ఖాన్ అనే పేరు ఉన్న మేక ధర ఏకంగా రూ. 8 లక్షల పై మాటే.

బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు మేకలు, గొర్రెలు బలి ఇస్తుంటారు. బక్రీద్ పండుగ సందర్బంగా దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లోని వీధుల్లో జోరుగా మేకలు, గొర్రెలు విక్రయాలు జరుగుతుంటాయి. బక్రీద్ పండుగ కోసమే ప్రత్యేకంగా మేకలు పెంచుతుంటారు.

ఈ బక్రీద్ పండుగ సందర్బంగా బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరుతో ఓ మేకను పెంచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజక వర్గం గోరఖ్ పూర్ లో బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరుతో ఓ మేకను పెంచారు.

సల్మాన్ ఖాన్ అనే పేరు ఉన్న ఈ మేక ధర రూ. 8 లక్షలు అని దాని యజమాని నిర్ణయించారు. సల్మాన్ ఖాన్ అనే పేరు ఉన్న మేకను దాని యజమాని రూ. 8 లక్షల ధర నిర్ణయించి వేలానికి పెట్టారు. 95 నుంచి 100 కేజీలు ఉన్న సల్మాన్ ఖాన్ అనే పేరు ఉన్న ఈ మేక ధర రూ. 8 లక్షల నుంచి ఎంత వరకు అమ్ముడు పోతుందో అనే విషయం అంతు చిక్కడం లేదు.

కేవలం బాలివుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు పెట్టడం వలనే ఈ మేక ఇంత ధర పలకడం లేదని, ఈ మేక మీద ఉన్న నల్లటి మచ్చల వలనే ఇంత ధరకు అమ్ముడు పోతోందని దాని యజమాని ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు. చూడటానికి సల్మాన్ ఖాన్ లాగే ఈ మేక చాల అందంగా, బలంగా ఉందని ఆయన అంటున్నారు.

సల్మాన్ ఖాన్ మేక మీద ఉన్న నల్లటి మచ్చలు కలిపి చదివితే అరబిక్ బాషలో అల్లాహ్ అనే అర్థం వస్తోందని, అందుకే ఈ మేక ప్రత్యేకంగా ఉందని దాని యజమాని అంటున్నారు. ఇలాంటి మేకను పెంచుకుంటే అదృష్టం చాల కలిసి వస్తుందనే నమ్మకం ఉందని, అందుకే పోటీ ఎక్కువ అయ్యిందని దాని యజమాని చెబుతున్నారు.

ఈ మేకను తాము అన్ని మేకలతో పాటు పెంచలేదని, సొంత సోదరుడి సమానంతో పెంచుకున్నామని దాని యజమాని అంటున్నారు. అన్ని మేకలకు పెట్టినట్లు తాము కూరగాయలు, ఆకులు పెట్టలేదని, చిప్స్, కాఫీలు, డ్రై ఫ్రూట్స్ తో దానిని పెంచామని, అది నిద్రపోవడానికి ప్రత్యేకంగా బెడ్ తయారు చేయించామని వివరించారు.

సల్మాన్ ఖాన్ మేకను పెంచడానికి ప్రతిరోజూ రూ. 700 నుంచి రూ. 800 వరకు ఖర్చు అయ్యిందని దాని యజమాని చెప్పారు. మొత్తం మీద రూ. 8 లక్షల నుంచి సల్మాన్ ఖాన్ అనే మేక ధర ఎంత వరకూ అమ్మడుపోతుందో అనే విషయం తెలుసుకోవాలని చాల మంది ఎదురు చూస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here