బట్టల దుకాణంలో ఆవు.. కంగారు పడొద్దు, అది డైలీ కస్టమర్!

0
0


క్లాత్ షాపులో పడుకున్న ఆవును చూసి కంగారు పడకండి. అది కూడా మనలాగే కస్టమర్. మనం రోజూ ఆ క్లాత్ షాప్‌కు వెళ్లినా వెళ్లకున్నా.. ఆ ఆవు మాత్రం క్రమం తప్పకుండా అక్కడికి వెళ్తుంది. దుకాణంలోనే కాసేపు సేద తీరి.. బోర్ కొట్టగానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోకి కడప జిల్లా మైదకూరులో గల సాయిరాం క్లాత్ స్టోర్‌లో ఎప్పుడు చూసినా ఓ ఆవు ప్రత్యక్షం అవుతుంది. షాపు తెరవగానే అది ఆ దుకాణంలోకి వెళ్తుంది. ఫ్యాన్ గాలిని ఆస్వాదిస్తూ.. పరుపుపై సేద తీరుతుంది. ఫ్యాన్ కట్టేయగానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదేంటీ? అది ఎవరినైనా గాయపరిస్తే? అనే కదా మీ డౌట్? ఆ భయమే మీకు అక్కర్లేదు.

Also Read: అద్భుతం.. ఈ గుడిలో దీపం నీటితో వెలుగుతోంది!

గత ఆరు నెలల నుంచి ఆ ఆవు ఈ దుకాణంలోకి వచ్చి పోతోంది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. ‘‘మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటా’’ అన్నట్లుగా అది ప్రవర్తిస్తుంది. ఈ సందర్భంగా ఆ దుకాణం యజమాని పొలిమేర ఒబయ్య మాట్లాడుతూ.. ‘‘వేసవి కాలంలో ఓ రోజు ఆ ఆవు అకస్మాత్తుగా దుకాణంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత లోపలే పడుకుంది. దాన్ని బయటకు తరిమేందుకు ప్రయత్నించినా కదల్లేదు. చివరికి దానికదే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే, ఆవు దుకాణంలో ఉండటం వల్ల బేరాలు పోతాయనే భయంతో దాన్ని చాలాసార్లు బయటకు పంపేందుకు ప్రయత్నించా’’ అని తెలిపారు.

Also Read: మిస్సైన విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

‘‘ఎనిమిది నెలలుగా ఈ ఆవు మా దుకాణానికి వచ్చిపోతుంది. అయితే, ఏ రోజు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. తెల్లని పరుపు మీద పడుకున్నా.. ఏ రోజు పేడ, మూత్రం వంటివి పోయలేదు’’ ఒబయ్య పేర్కొన్నారు. ఇప్పుడు ఈ దుకాణాన్ని అంతా ‘ఆవు షాపు’ అంటున్నారు. ఇక్కడికి వచ్చే మహిళా కస్టమర్లు ఆవుకు రాసేందుకు పసుపు, కుంకుమ తెస్తున్నారు. అరటి పండ్లు పెడుతున్నారు. ఈ ఆవు వచ్చిన తర్వాతి రోజు నుంచి ఒబయ్యకు కస్టమర్లు కూడా పెరిగారు. త్వరలో ఈ ఆవు బొమ్మను తన దుకాణానికి చిహ్నంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి మీరు ఎప్పుడైనా మైదకూరులో ఈ ఆవు షాపుకు వెళ్లడం మరిచిపోకండి.

వీడియో:

stray cow visits this cloth store regularly

బట్టల దుకాణంలో ఆవు.. కంగారు పడొద్దు, అది డైలీ కస్టమర్!

LoadingSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here