బడిలో దాహం

0
0


బడిలో దాహం

నీటి సీసాలతోనే బడికి వస్తున్న విద్యార్థులు

ఉమ్మడి జిల్లాలో 686 పాఠశాలలకు నీటి వసతి కరవు

ప్రభుత్వ బడుల్లో తాగునీటి వసతి కొరవడింది. నిత్యం విద్యార్థులు సీసాలు పట్టుకొనే బడికి వస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగుతున్నారు. ప్రభుత్వం రూ. కోట్ల నిధులు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్నా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. తాజాగా తాగునీటి వసతి కల్పనపై విద్యాశాఖ దృష్టి సారించింది. కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. కామారెడ్డి సరస్వతి శిశుమందిర్‌లో శనివారం విభాగ్‌స్థాయి(కామారెడ్డి, ఇందూర్‌, జగిత్యాల) ఖేల్‌కూద్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. క్రీడల వల్ల విద్యార్థుల మానసిక స్థైర్యం, శారీరక దృఢత్వం పెరుగుతాయని పేర్కొన్నారు. అంతకు ముందు జ్యోతి వెలిగించి ఆటలు ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి మైదానంలో పరుగెత్తారు. మార్చ్‌ఫాస్ట్‌లో విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఇందూర్‌ విభాగ్‌ కార్యదర్శి హరిస్మరణ్‌రెడ్డి, పాఠశాల కమిటీ సభ్యులు శ్యాంసుందర్‌రావు, రణజిత్‌మోహన్‌, ప్రతాప్‌గౌడ్‌, ఎస్‌ఎన్‌ చారి, డాక్టర్‌ బసంత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల్లో బోర్ల ద్వారా, కుళాయిలతో తాగునీటిని సరఫరా చేస్తున్నా తాగడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇంటి నుంచే డబ్బాలు తెచ్చుకుంటున్నారు. కారణం పాఠశాలల్లో ఉన్న ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో తల్లిదండ్రులే బాటిళ్లు ఇచ్చి బడికి పంపుతున్నారు. ఉదాహరణకు గతంలో కామారెడ్డి మండలం సరంపల్లి పాఠశాలలో కలుషిత నీరు తాగి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. నాటి నుంచి విద్యార్థులు ఇంటి నీటినే తెచ్చుకుంటున్నారు. బోర్ల నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించే క్రమంలో అక్కడక్కడ పైపులు లీకేజీ అవుతున్నాయి. నీరు కలుషితమవుతోంది. ట్యాంకుల్లో నాచు పేరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. పైగా ఇప్పుడు కుళాయి కనెక్షన్లు లేని బడులకు సౌకర్యం కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. ఉన్న చోటే చేతులు కడుక్కోవడానికి వినియోగిస్తుంటే.. మళ్లీ కనెక్షన్లు ఇచ్చి ఏం చేస్తారో అధికారులకే తెలియాలి. వంద శాతం రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామనే భరోసా ఇవ్వనిదే ఎన్నిచర్యలు చేపట్టినా వృథా ప్రయాసే అవుతుంది.

కామారెడ్డిలో కుళాయిలు లేని ప్రభుత్వ బడి

ఈ చిత్రంలో కనిపిస్తుంది బాన్సువాడ మండలం కోనాపూర్‌ ఉన్నత పాఠశాల. ఇక్కడ విద్యార్థులు డబ్బా నీటిని తాగుతున్నారు. పాఠశాలల్లో 50 శాతం మంది విద్యార్థులు అందుబాటులో ఉన్న నీటిని వినియోగిస్తున్నారు. మిగతా విద్యార్థులకు రక్షిత నీరు అందని కారణంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తుంది జుక్కల్‌ నియోజకవర్గం లాడేగావ్‌ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 130 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో సరైన తాగునీటి వసతి లేదు. విద్యార్థులు నిత్యం మధ్యాహ్న భోజనానికి ఇంటి నుంచే సీసాల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. పంచాయతీ బోరు నుంచి నేరుగా కుళాయి కనెక్షన్‌ ఉంది. ఆ నీటిని తాగడానికి సాహసించడం లేదు. రూ. లక్షల నిధులు ఖర్చు చేస్తున్న విద్యాశాఖ రక్షిత మంచినీరు సరఫరా చేయడంలో విఫలమవుతోంది.

నిత్యం డబ్బా నీళ్లే గతి

ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం డబ్బా నీళ్లే గతవుతున్నాయి. కొన్నిచోట్ల వసతి కల్పించినా తాగడానికి వీలు లేకుండా పోతోంది.

పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చిన నీటిని కేవలం చేతులు శుభ్రపరుచుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రతి విద్యార్థికి పుస్తకాల మోతతో పాటు నీటి డబ్బాల మోత తప్పడం లేదు. మూడో తరగతి విద్యార్థికి 8 కిలోల పుస్తకాల సంచితో పాటు అదనంగా బాటిల్‌ బరువు మోయాల్సి వస్తోంది.

బడిలోదాహం

జలమణి అభాసుపాలు

పాఠశాలల్లో జలమణి కింద రూ.లక్షలు ఖర్చు పెట్టి యంత్రాలను ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో ఫలితమివ్వడం లేదు. ఒక్కో పాఠశాలలో రూ. 2000- రూ. 3000 వరకు వెచ్చించి నెలకొల్పిన యంత్రాలు చాలా చోట్ల మొరాయిస్తున్నాయి. శుద్ధి యంత్రాల్లో వివిధ పరికరాలను మార్చకపోవడంతో పాడయ్యాయి. దీంతో ఈ పథకం అభాసుపాలైంది.

కుళాయి కనెక్షన్లు లేని పాఠశాలల్లో త్వరలో సౌకర్యం కల్పిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రధానోపాధ్యాయులు కుళాయి కనెక్షన్ల నిమిత్తం పంచాయతీ, పురపాలికల్లో దరఖాస్తు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి కుళాయిల ద్వారా నీటిని అందిస్తున్న పాఠశాలల్లో వినియోగించడం లేదు. ప్రస్తుతం కనెక్షన్లు సమకూరుస్తామని చెబుతున్నా రక్షిత నీటి సరఫరాకు భరోసా లేదు.

వసతుల కల్పనకు చర్యలు – రాజు, డీఈవో-కామారెడ్డి

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైతే కుళాయి కనెక్షన్లు లేవో అక్కడ వసతి కల్పిస్తాం. గతంలో ఏర్పాటు చేసిన జలమణి యంత్రాలను బాగు చేయడానికి నిధుల కోసం విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపాం. రక్షిత మంచినీటి సరఫరాకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here