బడ్జెట్ తర్వాత 10% నష్టపోయిన మార్కెట్లు, అందుకే FPIలు దూరం

0
0


బడ్జెట్ తర్వాత 10% నష్టపోయిన మార్కెట్లు, అందుకే FPIలు దూరం

న్యూఢిల్లీ: ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవి చూశాయి. శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. మధ్యాహ్నం నిఫ్టీ 10,950 వద్ద, సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అయ్యాయి. అదే సమయంలో డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోయింది.

జూన్ 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సూచీలు దాదాపు పది శాతం నష్టపోయాయి. సూపర్ రిచ్‌లపై అధిక పన్ను కారణంగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దాదాపు 40 శాతం ఎఫ్‌పీఐలు ఉన్నారు. వారు తమ కార్పోరేట్స్‌ను మార్చుకోవడం లేదా అధికా పన్ను చెల్లించాలి. గత కొన్ని వారాలుగా విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారు. ఇది కూడా దేశీయ సూచీల తగ్గుదలకు కారణం. వారు ఎక్కువ పన్ను చెల్లించడానికి బదులు వాటాల విక్రయానికి లేదా దూరంగా జరగడం చేస్తున్నారు.

జూలై నెలలో డొమెస్టిక్ మార్కెట్లో రూ.16,870 కోట్ల ఎఫ్‌పీఐ విక్రయాలు జరిగాయి. ఆగస్టులోను విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఆగస్టు 1న రూ.1,085 కోట్ల విక్రయాలు జరిగాయి. వీటి అమ్మకాలు కొనసాగితే మార్కెట్లు మరింత దిగజారే పరిస్థితులు ఉన్నాయి.

ఎఫ్‌పీఐల విక్రయానికి కేవలం ఒక సర్ ఛార్జీ మాత్రమే కారణం కాదు. ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది. జూలై నెలలో వాహన కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కొన్ని కార్ల అమ్మకాలు 69 శాతం వరకు కూడా పడిపోయాయి. మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎయిచర్ మోటార్స్, హోండా కార్స్ వంటి కంపెనీల వాహన విక్రయాలు పడిపోయాయి.

పైగా హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద పెద్ద కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. వీటికి తోడు NBFC ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య ఆర్థిక వ్యవస్థ మందగమన సమస్యను మరింత తీవ్రతరం చేసింది. బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఇప్పటికే పది శాతం పడిపోయాయి. మరో ఐదు శాతం పడిపోతే పరిస్థితి దిగజారుతుందంటున్నారు. కాగా, మార్కెట్లు భారీగా నష్టపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లు జరపవచ్చా అంటే మంచిది కాదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here