బతుకమ్మ చీరలు పంపిణీ

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడబిడ్డలకు అందించే చీరల కానుకలో భాగంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు మండలంలోని తాడ్‌ బిలోలి, కళ్యాపూర్‌, దండిగుట్ట గ్రామాల్లో సర్పంచ్‌లు సునీత, శ్రీదేవిలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బతుకమ్మ ఖ్యాతి పెరిగిందని పల్లెపల్లెల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తలపించేలా జరుగుతున్నాయని అన్నారు. ఆడపడుచులు అందరూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా కేసీఆర్‌ బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here