బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

0
12


బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక


బతుకమ్మ సంబరాల్లో వీసీ అనిల్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ బలరాములు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని తెలంగాణ విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిల్‌కుమార్‌ కొనియాడారు. వర్సిటీ క్రీడా మైదానంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ పండుగ జరుపుకొన్నారు. మహిళా ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థినులు ‘బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో బంగారు బతుకమ్మ’ అంటూ పాటలు పాడారు. కోలాటం ఆడారు. వీసీ అనిల్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ బలరాములు పాల్గొని బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. మహిళా విభాగం డైరెక్టర్‌ ప్రసన్నశీల, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ కనకయ్య, పరీక్షల నియంత్రణాధికారి చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌ ఆరతి, వార్డెన్‌ నీలిమా, పీఆర్వో త్రివేణి పాల్గొన్నారు.

దక్షిణ ప్రాంగణంలో

భిక్కనూరు, న్యూస్‌టుడే: తెవివి దక్షిణ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమైన బతుకమ్మ సంబురాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌కు విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రాంగణం ఆవరణలో విద్యార్థులు బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు, మహిళా ఆచార్యులు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ మోహన్‌బాబు, సుధాకర్‌గౌడ్‌, వీరభద్రం, హరిత పాల్గొన్నారు.

నాగరాజుకు సన్మానం

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న తెవివి రసాయనశాస్త్ర సహ ఆచార్యుడు నాగరాజు అభినందన సభను టూటా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌ ఆయన్ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ కనకయ, టూటా ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పున్నయ్య, పాల్గొన్నారు.

సౌకర్యాలు కల్పించాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో పరిశోధకులకు సౌకర్యాలు కల్పించాలని ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌కు పరిశోధక విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రవి, కన్వీనర్‌ సంతోష్‌ బుధవారం వినతి పత్రం అందించారు. గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు, గ్రంథాలయం, వసతి సౌకర్యం ఇవ్వాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here