బతుకమ్మ పండగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ పండుగను దష్టిలో పెట్టుకొని పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం సాయంత్రం మినీ అంబేద్కర్‌ భవన్‌లో అర్బన్‌ నియోజవర్గ చీరల పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ గుప్త చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుపేద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. బతుకమ్మ చీరల ఆడపడుచులకు ప్రయోజనంతో పాటుగా చేనేత కార్మికులకు జీవనాధారం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఒక్కొక్క బతుకమ్మ పండుగకు విభిన్న రంగులలో మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని, అయితే ఈసారి పది రంగులతో వంద రకాలుగా గతంలో కంటే మిన్నగా ఆకర్షణీయమైన రంగుల్లో పంపిణీ చేస్తామని, గత సంవత్సరం 4 లక్షల 83 వేల చీరలు పంపిణీ చేశామని, ఈ సంవత్సరం సుమారు 5 లక్షల 84 వేల చీరలను జిల్లాకు వచ్చాయని వాటిని మల్లారం బోధన్‌ వ్యవసాయ గిడ్డంగుల్లో భద్రపరచినట్టు చెప్పారు. దసరా పండుగకు ఆడపడుచులకు గిఫ్టుగా అందిస్తున్నారని చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here