బతుకమ్మ శుభదాయక పండుగ

0
3


బతుకమ్మ శుభదాయక పండుగ

కామారెడ్డి జిల్లా పరిషత్‌, న్యూస్‌టుడే: బతుకమ్మ శుభదాయక పండుగని అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కుటుంబానికి దిశా నిర్దేశం చేసే శక్తి మహిళలకే ఉందని కొనియాడారు. కార్యక్రమంలో తాడ్వాయి జడ్పీటీసీ సభ్యురాలు, బతుకమ్మ సమన్వయకర్త మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిణి రాధమ్మ ఆధ్వర్యంలో జిల్లాలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు, 350 మంది అంగన్‌వాడీ టీచర్లు, కిశోర బాలికలు రంగు, రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. మహిళలతో కలిసి అసిస్టెంట్‌ కలెక్టర్‌ బతుకమ్మ ఆడి అందరినీ ఆనంద పరిచారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here