బతుకమ్మ సంబరాలు

0
3


బతుకమ్మ సంబరాలు

ప్రభుత్వ వైద్యకళాశాలలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగర పాలక సంస్థలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిణులతో పాటు మహిళా సంఘాల సభ్యులు బతుకమ్మ పాటలు పాడుతూ…ఆటలు ఆడారు. చిన్నారులు, కళాకారులు, అధికారులు నృత్యాలు చేశారు. బతుకమ్మలు తీసుకొచ్చిన వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఇందులో నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, మెప్మా పీడీ రాములు, డిప్యూటీ సిటీ ప్లానర్‌ జలేందర్‌రెడ్డి, మున్సిపల్‌ ఇంజినీర్లు ఆనంద్‌ సాగర్‌, రషీద్‌, కార్యాలయ మేనేజర్‌ దేవేందర్‌, మెప్మా ప్రతినిధులు మాధురి, శోభారాణి, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here