బతుకమ్మ సంబురాల్లో జడ్పీ ఛైర్మన్‌

0
1


బతుకమ్మ సంబురాల్లో జడ్పీ ఛైర్మన్‌

మాదాపూర్‌లో బతుకమ్మ ఎత్తుకున్న జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు

మాదాపూర్‌ (మాక్లూర్‌), న్యూస్‌టుడే: మాదాపూర్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రమేశ్‌ రాఠోడ్‌, ఎంపీపీ మాస్త ప్రభాకర్‌, ఎంపీడీవో సక్రియానాయక్‌, ఐకేపీ ఏపీఎం అనిల్‌కుమార్‌, సర్పంచి కొట్టాల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు లలిత, ఉప సర్పంచి శశికుమార్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here