బతుకునిచ్చే కుంట

0
4


బతుకునిచ్చే కుంట

నీటితో కళకళలాడుతున్న బతుకమ్మ కుంట

బోర్గాం(పి)(మోపాల్‌), న్యూస్‌టుడే: నగర శివారులోని బోర్గాం(పి)లోని బతుకమ్మ కుంట మూగ జీవాలకు వరంగా మారింది. గ్రామ పొలిమేరల నుంచి పులాంగ్‌ వాగు పారడంతోపాటు, మంచిప్ప, కులాస్‌పూర్‌ గ్రామాల్లోని చెరువుల నుంచి వచ్చే నీరు సైతం ఇదే వాగులోకి చేరుతుంది. దీంతో దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ వాగుకు అడ్డంగా చెక్‌డ్యాం నిర్మించి, చిన్న కుంటను తవ్వారు. గ్రామంలోని బతుకమ్మలను, వినాయక విగ్రహాలను ఇదే కుంటలో నిమజ్జనం చేయడంతో ఈ కుంటకు బతుకమ్మ కుంటగా పేరొచ్చింది. కాలక్రమంలో ఈ కుంట విస్తరించి చిన్న చెరువులాగా మారింది. పశువులు, గొర్రెలు, మేకలతోపాటు ఇతర మూగ జీవాలు ఈ బతుకమ్మ కుంట చెంతనే సేదదీరుతూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వ్యవసాయ బోరుపంపులు, అటు గృహాల్లో ఉండే బోరుపంపుల్లో భూగర్బజలాలు పెరుగుతున్నాయి. కుంట చుట్టూ పలు ఆలయాలు సైతం వెలియడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here