బద్దలైన రికార్డులవే: సచిన్‌కి 7 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ

0
0


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచకప్ ఆరంభం నుంచీ సాగుతున్న కోహ్లీ సెంచరీ నిరీక్షణకు వెస్టిండిస్ పర్యటనలో తెరదించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 9 మ్యాచులు ఆడిన కోహ్లీ సెంచరీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ (123) సాధించాడు. ఆ సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు, అనంతరం జరిగిన ప్రపంచకప్‌లో 9 మొత్తం 11 మ్యాచ్‌ల్లోనూ సెంచరీ కొట్టలేకపోయాడు. ఇలా గతంలో కూడా కోహ్లీ 18 మ్యాచ్‌ల్లో సెంచరీని సాధించలేకపోయాడు.

ఓపెనర్లు విఫలమైన వేళ… నాపై మరింత బాధ్యత పెరిగింది: కోహ్లీ

అయితే, ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా విండిస్ జట్టుపై కోహ్లీకి ఇది 8వ సెంచరీ.

అంతకముందు ఆస్ట్రేలియా, శ్రీలంకపై కూడా కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. రెండో వన్డేలో కోహ్లీ సెంచరీతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

42వ సెంచరీతో కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే:

సచిన్‌కి 7 సెంచరీల దూరంలో కోహ్లీ

సచిన్‌కి 7 సెంచరీల దూరంలో కోహ్లీ

42 – వన్డేల్లో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (49)కు కోహ్లీ కేవలం 7 సెంచరీల దూరంలో ఉన్నాడు.

3 – కరేబియన్ దీవుల్లో వెస్టిండిస్ జట్టుపై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య. కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా, ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్‌ సైతం మూడు సెంచరీలు సాధించిన ఆటగాళ్లు. ఇక, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ సైతం వెస్టిండిస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లపై 2007లో మూడు సెంచరీలు సాధించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ

8 – వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా విండిస్ జట్టుపై కోహ్లీకి ఇది 8వ సెంచరీ. అంతకముందు ఆస్ట్రేలియా, శ్రీలంకపై కూడా కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ప్రత్యర్థిపై సచిన్ టెండూల్కర్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

6 – వెస్టిండిస్ జట్టుపై కోహ్లీ సాధించిన 8 సెంచరీల్లో ఆరు సెంచరీలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. ఒక ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంగ్లాండ్ జట్టుపై 2001లో నమోదు చేసిన 5 సెంచరీలు రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.

కెప్టెన్‌గా 20వ సెంచరీ

కెప్టెన్‌గా 20వ సెంచరీ

20 – వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు కెప్టెన్‌గా నమోదు చేసిన సెంచరీల సంఖ్య. ఇక, ధోని నాయకత్వంలో విరాట్ కోహ్లీ 19 సెంచరీలు సాధించాడు.

34 – వెస్టిండిస్ జట్టుపై వన్డేల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి విరాట్ కోహ్లీకి అవసరమైన ఇన్నింగ్స్. ప్రత్యర్ధి జట్టుపై వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 37 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు రోహిత్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.

విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

విండిస్‌పై రెండో అత్యధిక స్కోరు

విండిస్‌పై రెండో అత్యధిక స్కోరు

120 – ఈ వన్డేలో విరాట్ కోహ్లీ సాధించిన 120 పరుగులు వెస్టిండిస్ జట్టుపై ఓ భారత ఆటగాడికి రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. 2009లో కింగ్స్ స్టన్ వేదికగా జరిగిన వన్డేలో యువరాజ్ సింగ్ బాదిన 131 పరుగులు ఇప్పటివరకు అత్యధిక పరుగులు కావడం విశేషం.

11046 – వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసిన పరుగులు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 8వ స్థానంలో ఉన్నాడు. ఇక, వన్డేల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here