బన్నీ, మహేష్ అయితే ఏంటి.? తగ్గేది లేదంటున్న నందమూరి హీరో

0
1


ప్రతీ ఏడాది లాగే 2020లో సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌కు రసవత్తరంగా మారనుంది. ఇద్దరు టాప్‌ స్టార్‌లు అల్లు అర్జున్‌, మహేష్ బాబులు ఈ సీజన్‌లో తలపడుతున్నారు. అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ ఇద్దరు స్టార్లు జనవరి 12న ఒకే రోజు బరిలో దిగుతున్నారు. అయితే ఓ బిగ్ ఫైట్‌ను తప్పించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.

మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో సినిమాలో ఒకే రోజు రిలీజ్‌ అయితే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్ కలెక్షన్ల మీద కూడా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సీజన్‌లో మరో సినిమా రిలీజ్ చేస్తే నామ మాత్రంగా కూడా థియేటర్లు దొరకటం కష్టమే.
Also Read: ప్రభాస్‌ కొత్త సినిమా కథ.. పాత చింతకాయ పచ్చడే..!

అయితే ఇంత టఫ్‌ సిచ్యువేషన్‌లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు నందమూరి అందగాడు కళ్యాణ్‌ రామ్‌. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభిచిన చిత్రయూనిట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.
Also Read: ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

ప్రస్తుతానికి ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ అయితే ఉంది. సరైన సమయంలో రిలీజ్‌ అయితే సినిమాకు మంచి టాక్‌రావటం కాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్‌ మిస్‌ కావద్దని భావిస్తున్నారు యూనిట్‌. బన్నీ, మహేష్ లాంటి టాప్‌ స్టార్స్‌ బరిలో ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జనవరి 15న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా మెహరీన్‌ నటిస్తోంది. గోపి సుందర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు రాజ్‌ తోట సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
Also Read: యాంకర్‌ ప్రదీప్‌కు ఏమయ్యాడు..? ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు నిజమేనా?Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here