బరితెగించిన మరో మృగాడు.. బిస్కెట్ ఇస్తానని బలవంతంగా తీసుకెళ్ళి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

0
1


బరితెగించిన మరో మృగాడు.. బిస్కెట్ ఇస్తానని బలవంతంగా తీసుకెళ్ళి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిన్నటికి నిన్న ఓరుగల్లులో 9 నెలల పసికందుపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడికి ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తికి తాజాగా జరుగుతున్న ఘటనలే ఒక ఉదాహరణ . పోక్సో వాటి చట్టాల్లో సవరణలు చేసినా , చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఉరి శిక్ష వేసేలా చటాలు మార్చినా సరే అన్యం పుణ్యం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి.

నాలుగేళ్ల చిన్నారిపై ఘాతుకం .. బిస్కెట్ ఇస్తానని ఎత్తుకెళ్ళి రేప్ చేసిన కామాంధుడు

తాజాగా నెల్లూరు జిల్లాలో మరో చిన్నారి అందమైన బాల్యాన్ని చిదిమేశాడు ఓ కామాంధుడు. బిస్కెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘాతుకం బాలికా సంరక్షణను మరోమారు ప్రశ్నిస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభంతెలియని నాలుగేళ్ల చిన్నారిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బిస్కెట్ ఇస్తానని చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇంటి సమీపంలో వెతికారు. తరువాత కొంత సేపటికి ఏడుస్తూ పాప ఇంటికి వచ్చింది .

తల్లిదండ్రులకు జరిగింది చెప్పిన చిన్నారి .. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎక్కడికి వెళ్లావు … ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిన తల్లిదండ్రులకు పాప వారికి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిపై పశువులా ప్రవర్తించిన నిందితుడిపై కేసు నమోదు చేశారు.ఇలా రోజుకో చోట పసి మొగ్గలను చిదిమేస్తుంటే , బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా ఈ దారుణాలకు అడ్డుకట్ట ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నిర్భయ వంటి కఠినతరమైన చట్టాలు ఉన్నా కామాంధులకు భయం లేదని అర్థమవుతుంది. చట్టపరమైన శిక్షలు విధించిటమే కాకుండా పాఠశాల విద్య నుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించేలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పు తీసుకు రాగలిగితే కొంతమేరకైనా ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here