బర్మింగ్‌హామ్‌ హోటల్లో కోహ్లీసేనకు చేదు అనుభవం

0
0


హైదరాబాద్: భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో తలడనుంది. దీంతో శుక్రవారం కోహ్లీసేన బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌ స్ట్రీట్‌లోని హ్యాట్ రెజెన్సీలో భారత క్రికెట్ జట్టుకు వసతి కల్పించారు.

ఆటగాళ్లు బస చేసిన హ్యాట్ రెజెన్సీ హోటల్‌లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు. ఆటగాళ్లతో వారితో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. తాము ఇండియా నుంచి వచ్చిన అథితులమని చెప్పి ఆటగాళ్లు బస చేసిన హోటల్ గదుల్లోకి చొరబడ్డారు. దీంతో ఆగ్రహించిన జట్టు మేనేజ్‌మెంట్‌ హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టెలీగ్రాఫ్ కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు కేకలు వేస్తూ ఆటగాళ్లుండే రెజెన్సీ లాబీవైపు ప్రవేశించారు. అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల దగ్గర తిరుగుతూ.. వాళ్ల కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తీశారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

దీనిపై ఆగ్రహించిన ఆటగాళ్లు వెంటనే జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం తెలపగా.. హోటల్ యాజమాన్యం వారిని హెచ్చరించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. హోటళ్లలో ఉండే భద్రతా సిబ్బందితో పాటు ఐసీసీ కూడా అన్ని జట్ల ఆటగాళ్లకు అదనపు భద్రతను కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here