బస్సే అవగాహన సదస్సుకు అడ్డా

0
4


బస్సే అవగాహన సదస్సుకు అడ్డా


అవగాహన కల్పించేందుకు సిద్ధం చేసిన బస్సు (మాట్లాడుతున్న ఆరోగ్యశాఖ హెచ్‌ఈవో మనోహర్‌)

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఎవరికైనా అవగాహన సదస్సులు గదిలో ఏర్పాటు చేసి మంచిమాటలు చెబుతారు.. కానీ ఆర్టీసీ అధికారులు కొత్త ఆలోచన చేశారు. నాలుగు గోడల మధ్య బంధించినట్లు ఉండకుండా బస్సునే అవగాహన సదస్సులకు అడ్డాగా మార్చేశారు. బస్సులో ప్రొజెక్టర్‌, బస్సు చుట్టూ ఆరోగ్య సూత్రాలు వివరించే చిత్రాలు, సూచనలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు..కండక్టర్లు, సిబ్బందికి అవగాహన సదస్సులు ఇక నుంచి ఈ బస్సులోనే ఏర్పాటు చేస్తారు. ‘ఆరోగ్యం- ఆహారం’ ఈ రెండు అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రోజు 30 మంది చొప్పున ప్రయోగాత్మకంగా డిపో-1లో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంచి ఫలితాలు వస్తే జిల్లాలోని ఆర్టీసీ సిబ్బందికి దశల వారీగా ఈ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

చిన్న జాగ్రత్తలతో ఆరోగ్యం భద్రం

నిజామాబాద్‌ అర్బన్‌: ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యఆరోగ్యశాఖ హెచ్‌ఈవో మనోహర్‌ తెలిపారు. నగరంలోని డిపో-1లో ఆర్టీసీ సిబ్బందికి ‘ఆరోగ్యం-ఆహారం’ అనే అంశంపై అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలని చెప్పారు. ఆహారం తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here