బాన్సువాడలో సందడి చేసిన సినీ తార ప్రణతి సుభాష్‌

0
5నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో ఆదివారం ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌ను సినీతార ప్రణతి, రాష్ట్ర నాయకులు బాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సినీతార మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడ ప్రాంతంలో మంచి వాతావరణం ఉందని, ఇక్కడ పెద్ద షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఎస్‌ ఎస్‌ షాపింగ్‌ మాల్‌ వ్యాపారవెత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్‌ కేంద్రం ఏర్పడినా ప్రజలకు ఖరిదైన వస్త్రాలు అందుబాటులో లభించడం లేదని, జిల్లా కేంద్రానికి వెళ్లి పండుగ పెళ్లి కార్యక్రమాలకు బట్టలు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. వీటిని దష్టిలో పెట్టుకొని వ్రస్తవ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. మంచి దుస్తులను ఇక్కడి ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సంధర్భంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినీతార ప్రణతి సుభాష్‌, రాష్ట్ర యువనాయకులు బాస్కర్‌ రెడ్డి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here