బాపూజీ అడుగుజాడల్లో నడవడమే అసలైన నివాళి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు తెలంగాణ పోరాట స్ఫూర్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రజల కోసం ఏ విధంగా తన జీవితాన్ని అంకితం చేశారో ఆయన మార్గంలో పయనించడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కొరకు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ కోసం శాసనసభ పదవిని, మంత్రి పదవిని, డిప్యూటీ స్పీకర్‌ పదవిని వదిలేసిన గొప్ప త్యాగశీలి అని తెలంగాణ ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. వారి సేవలకు గుర్తుగా ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెట్టారని తెలిపారు. బీసీ, ఎస్‌సి, ఎస్‌టి తదితర వెనుకబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని బిసి వసతిగహాల్లో మూడు వేల మూడు వందల మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వీరికి మరింత మెరుగైన సేవలు అందించడానికి అధికారులకు సూచనలు చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎంతోమంది ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఉన్నారన్నారు. అన్ని కుల వత్తుల వారి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here