బాబోయ్ ఇదేం జీవి?.. చెట్టు వేర్లను తలపించే శరీరంతో వణికిస్తున్న కీటకం

0
2


కీటకాన్ని చూస్తే చెట్టు వేర్లులా కనిపిస్తుంది. దాన్ని తాకితే గానీ అది కదిలే కీటకమనే సంగతి తెలీదు. అలస్కా అమెరికాలోని అలస్కా సముద్రం తీరంలో లభించిన ఈ జీవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని రూపం, కదలికలు గ్రహాంతరవాసి (ఏలియన్‌) తరహాలో ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అలస్కాకు చెందిన సరా వస్సెర్ అల్ఫార్డ్ అనే ఓ యువతి చేపల వేటకు వెళ్లినప్పుడు ఈ వింత జీవి చిక్కింది. ఆరెంజ్ రంగులో చెట్ల వేర్లు తరహా శరీరంతో ఉన్న ఆ జీవి వీడియోను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 24 వేల మందికి పైగా షేర్ చేసుకోగా 1.5 మిలియన్ మంది వీక్షించారు.

వీడియో:
ఏలియన్ కాదు.. సముద్ర జీవి: ఈ జీవిని బాస్కెట్ స్టార్ అంటారని సరా తెలిపింది. ఇది సముద్రం అడుగున జీవిస్తుందని, నీటిపైకి రావడం చాలా అరుదని తెలిపింది. అయితే, నెటిజనులు మాత్రం దీన్ని ఏలియన్ అని అంటున్నారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో మనుషుల ముఖానికి అంటుకుపోయే ఏలియన్ కావచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సృష్టిలో ఇలాంటి జీవి ఉందంటే నిజంగా వింతే కదా!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here