బాలకృష్ణకు విలన్‌గా బాలీవుడ్ హీరో.. బోయపాటి భారీ ప్లాన్

0
1


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి. ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘వినయ విధేయ రామ’ సినిమాలే దీనికి మంచి ఉదాహరణలు. ‘లెజెండ్’ సినిమాతో జగపతిబాబును విలన్‌గా మార్చారు బోయపాటి. ఈ సినిమాలో బాలయ్య, జగ్గుభాయ్ పోటాపోటీగా నటించారు. హీరో, విలన్‌గా ఈ ఇద్దరి కాంబినేషన్‌ అదిరిపోయింది.

ఆ తరవాత ‘సరైనోడు’ సినిమాలో ఆది పినిశెట్టిని విలన్‌ను చేశారు బోయపాటి. బన్నీ హీరోయిజానికి తగిన విలనిజంను చూపించారు ఆది. బన్నీతో పాటు ఆదికి కూడా మంచి పేరొచ్చింది. అలాగే ‘వినయ విధేయ రామ’ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ను విలన్‌గా తీసుకున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోను బోయపాటి విలన్‌గా పరిచయం చేయబోతున్నారు. అది కూడా నటిసింహా నందమూరి బాలకృష్ణ సినిమా ద్వారా. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్.

ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రూలర్’ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా సంజయ్ దత్‌ను తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆయన కాల్షీట్లు కూడా ఇచ్చేశారట. ఇక అధికారికంగా ప్రకటించడమే ఉందని అంటున్నారు.

Also Read: తండ్రి కాబోతున్న ప్రభాస్.. వేరొకరికి ఛాన్స్ ఇవ్వనంటోన్న రెబల్ స్టార్!

జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తరవాత సంజయ్ దత్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్ 2’లో విలన్‌గా నటిస్తు్న్నారు. ఇప్పుడు బాలయ్య సినిమాను ఓకే చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకానుంది. మరోవైపు ‘రూలర్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here