బాలయ్యకు సోదరి పురంధరేశ్వరి కూడా షాక్ ఇచ్చారే ..ఏం చేశారంటే

0
0


బాలయ్యకు సోదరి పురంధరేశ్వరి కూడా షాక్ ఇచ్చారే ..ఏం చేశారంటే

  TDP కి గుడ్ బై చెప్పిన బాలయ్య బంధువు పొట్లూరి కృష్ణబాబు!! | NBK Relative Krishnababu Joined In BJP

  ఈసారి టీడీపీకే కాదు.. బాలయ్య బాబుకు కూడా గట్టి దెబ్బ తాకింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు షాక్ ఇచ్చింది మరెవరో కాదు స్వయానా ఆయన సోదరి దగ్గుపాటి పురంధరేశ్వరి . ఆమె బాలయ్య బంధువు పొట్లూరి కృష్ణ బాబును కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుండి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేత పురంధరేశ్వరి కూడా రంగంలోకి దిగారు .

  ఏపీలో కొనసాగుతున్న వలసలు .. చంద్రబాబుకే కాదు బాలయ్యకు వరుస షాకులు

  ఏపీలో కొనసాగుతున్న వలసలు .. చంద్రబాబుకే కాదు బాలయ్యకు వరుస షాకులు

  ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీకి భవిష్యత్ కష్టమే అన్న సంకేతాలిస్తున్నారు అధికార పార్టీ నేతలు . దీంతో ఎవరికి వారు సేఫ్ జోన్ వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ లో చేరాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్ మాటతో వైసీపీ గేట్లు క్లోజ్ అని భావించి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది . ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు . వారి బాటలో అంబికా కృష్ణ సైతం బీజేపీలో చేరి చంద్రబాబుకు, బాలయ్యకు షాక్ ఇచ్చారు.ఈ విషయం మరవకముందే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బతగిలింది. మొన్నటికి మొన్న విజయవాడకు చెందిన వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు. వచ్చేనెలలో వంగవీటి రంగా జయంతి నాడు ఆయన జనసేన కు జై కొట్టనున్నారు.

  పార్టీకి గుడ్ బై చెప్పిన బాలయ్య బంధువు పొట్లూరి కృష్ణబాబు

  పార్టీకి గుడ్ బై చెప్పిన బాలయ్య బంధువు పొట్లూరి కృష్ణబాబు

  ఇక పామర్రు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత కూడా పార్టీ వీడి బీజేపీలో చేరారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణబాబు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. పొట్లూరి కృష్ణబాబు తన భార్యతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పొట్లూరి హరిబాబు పార్టీ మార్పుకు పురంధరేశ్వరి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.

  రంగంలోకి దిగిన పురంధరేశ్వరి .. సోదరుడికి షాక్ ఇస్తున్న బీజేపీ నేత

  రంగంలోకి దిగిన పురంధరేశ్వరి .. సోదరుడికి షాక్ ఇస్తున్న బీజేపీ నేత

  బీజేపీలో కీలక నేతగా ఉన్న పురంధీశ్వరి బాలకృష్ణకు సమీప బంధువును టీడీపీ నుంచి బీజేపీలో చేరేలా చేసి బాలయ్యకు పెద్ద షాక్ ఇచ్చారు . ఇకపోతే బాలకృష్ణ, పురంధీశ్వరిలకు దగ్గరి బంధువులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు పురంధరీశ్వరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గంటాతో పాటు టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో ఎప్పుడు ఎవరు చంద్రబాబుకు షాక్ ఇస్తారో మరి. చంద్రబాబుతో పాటు బాలయ్యకు ఇప్పటికే అంబికా కృష్ణ , పొట్లూరి కృష్ణబాబు షాక్ ఇచ్చారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here