బిగ్గెస్ట్ షాపింగ్ సీజన్.. కానీ అంచనాలు తారుమారు: షాప్స్ ముందే క్లోజ్

0
0


బిగ్గెస్ట్ షాపింగ్ సీజన్.. కానీ అంచనాలు తారుమారు: షాప్స్ ముందే క్లోజ్

సంప్రదాయ దుకాణదారుల నుంచి మొదలుపెడితే ఆన్‌లైన్ షాపింగ్స్ వరకు.. అందరు కూడా దసరా, దీపావళి పండుగ సీజన్లో భారీ సేల్స్ ఉంటాయని ఆశలు పెట్టుకుంటారు. ఏడాది అంతా ఉండే సేల్స్ ఒక ఎత్తు అయితే కేవలం దీపావళి సీజన్లో ఉండే సేల్స్ మరో ఎత్తు. ఓ సంవత్సరంలో వ్యాపారులు అమ్మకాల ద్వారా పండుగ చేసుకునేది దీపావళి సమయంలో. అయితే ఈసారి సేల్స్ భారీగా తగ్గాయట. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక తెలిపింది. ప్రతి ఏడాదిలాగే ఈ దీపావళి సమయంలోను భారీ కొనుగోళ్లు జరిగాయని, కానీ గత పండుగ సీజన్ల కంటే తగ్గాయని ఈ నివేదిక తెలిపింది.

సర్వేలో ఇలా…

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దీపావళి వీక్‌లో నిపుణులు 120 రిటైల్ అవుట్ లెట్లలో సర్వే చేశారు. 90 శాతం మంది స్టోర్ కీపర్లు గత ఏడాది కంటే సేల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీపావళి పండుగ సమయంలో పలు దుకాణాలు ఖాళీగా కనిపించాయని, కొన్ని స్టోర్స్ త్వరగానే క్లోజ్ అయినట్లుగా గుర్తించామని నివేదికలో పాలుపంచుకున్న సంజయ్ మూకిమ్ అనే ఈక్విటీ స్ట్రాటజిస్ట్ చెప్పారు.

ముంబైలో చిన్న శాంపిల్.. కానీ

ముంబైలో చిన్న శాంపిల్.. కానీ

కేవలం ముంబైలో మేం సర్వే చేశామని, కాబట్టి ఈ ముంబై అంటే భారత్ అంతా అని చెప్పలేమని, మేం తీసుకున్న శాంపిల్ ఈ దేశంలో చాలా చాలా చిన్నది అని, అయితే పండుగ సీజన్లో డిమాండ్ పోకడకు ఇది ఒక నిదర్శనం అని సంజయ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య భయాలు కమ్ముకున్నాయి. భారత్‌లోను వినియోగం తగ్గడం వల్ల గత కొన్నాళ్లుగా మందగమనం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు దీపావళిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పండుగ సీజన్లో సేల్స్ పెరిగినప్పటికీ, అంతకుముందు పండుగ వలె లేవని నివేదిక చెబుతోంది.

అమ్మకాలపై కొంతమంది సంతృప్తి

అమ్మకాలపై కొంతమంది సంతృప్తి

ఇయర్ ఆన్ ఇయర్ పరంగా సేల్స్ తగ్గి రెవెన్యూ కూడా తగ్గింది. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది గత ఏడాదితో పోల్చుకొని రెవెన్యూ తగ్గినట్లు చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగమనంలో భాగంగా భారత్‌లోను ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు సేల్స్ తక్కువగా ఉంటాయని ముందే అంచనాకు వచ్చారు. అలాంటి వారిలో 35 శాతం మంది సేల్స్ తక్కువగా ఉంటాయని అంచనా వేశామని, అయితే తమ అంచనా కంటే కాస్త ఎక్కువ ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఆందోళనకర విషయం ఏమంటే ఆన్ లైన్ సేల్స్, బ్రాండెడ్ స్టోర్స్ వచ్చాక రిటైలర్స్ అమ్మకాలు తగ్గుతున్నాయి.

ఆటో సేల్స్ కూడా తగ్గాయి..

ఆటో సేల్స్ కూడా తగ్గాయి..

ఆటో ఇండస్ట్రీ గత కొంతకాలంగా మందగమనంతో కొనసాగుతోంది. పండుగ సమయంలోను సేల్స్ అంతగా లేవు. వాణిజ్య, పాసింజర్ వాహనాల సేల్స్ గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే తగ్గాయి. దిగ్గజ కంపెనీల సేల్స్ కూడా ఆశించిన మేర లేవు. గత ఏడాది కంటే ఆటో సేల్స్ కూడా ఈ పండుగ సీజన్లో తగ్గాయి. కాబట్టి భవిష్యత్తులోను ఈ తగ్గుదల కొనసాగుతుందని అంచనాకు వస్తున్నారు. అయితే ఈ తగ్గుదల స్వల్పకాలం మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. BS 6 వాహనాలకు మారడం, డీలర్ల వద్ద స్టోరేజ్ పెరగడం, రవాణా పరిణామాలపై అనిశ్చితి, వినియోగదారు సెంటిమెంట్ కుంటుపడిన నేపథ్యంలో ఆటో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలతో కాస్త పుంజుకుంటున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here