‘బిగ్‌ బ్రదర్’ రియాల్టీ షోలో సెక్స్.. చిక్కుల్లో మహిళా పోలీస్

0
2


ఇండియాలో ‘బిగ్‌బాస్’ తరహాలోనే పాశ్చాత్య దేశాల్లో ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షో కూడా బాగా పాపులర్. చెప్పాలంటే.. ‘బిగ్‌బాస్’ షో పుట్టిందే ‘బిగ్ బ్రదర్’ షో నుంచి. అయితే, ‘బిగ్‌బాస్’ తరహాలో ‘బిగ్ బ్రదర్’ సంసారపక్షంగా ఉండదు. అందులో సెలబ్రిటీల రోమాన్స్‌ను కూడా బాహాటంగా చూపిస్తారు. చివరికి శృంగారాన్ని కూడా బహిర్గతం చేస్తారు.

ఆఫ్రికాలోని ఓ టీవీ ఛానెల్‌లో జూన్ 30న మొదలైన నైజీరియన్ ‘బిగ్ బ్రదర్’ షోలో లండన్‌కు చెందిన 29 ఏళ్ల ఖాఫీ కరీమ్ అనే మహిళా పోలీస్ అధికారి పాల్గొంది. ఈ షోలో పాల్గొనేందుకు స్కాట్ ల్యాండ్ యార్డ్ (లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్) నుంచి అనుమతి లభించకపోయినా ఆమె తన యూనిఫామ్‌తో షోలో ఎంట్రీ ఇచ్చింది.

Read also: దుప్పట్లో దుమారం.. రియాలిటీ షోలో సెలబ్రిటీల సెక్స్, ప్రేక్షకులు షాక్!

సుమారు నెల రోజులు ‘బిగ్ బ్రదర్’ షోలోని హౌస్‌మేట్స్‌తో సావాసం చేసిన ఆమె ఓ సెలబ్రిటీతో సంబంధం పెట్టుకుంది. చివరికి అతడితో శరీరకంగా కూడా కలిసింది. హౌస్‌లో రొమాన్స్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు వారిద్దరూ మూడుసార్లు శృంగారంలో పాల్గొన్నట్లు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. ఆమె ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి ఇంకా 70 రోజులు ఉన్న నేపథ్యంలో గర్భవతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.

ఉద్యోగం ఊడినట్లే: పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి అనుమతి తీసుకోకుండా ‘బిగ్‌బ్రదర్’ షోలో పాల్గొన్నందుకు లండన్ పోలీస్ ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెపై విచారణ మొదలుపెట్టారు. ఆ షో పూర్తిచేసుకుని తిరిగి వచ్చేసరికి ఆమెకు ఆ ఉద్యోగం ఉండదని అధికారులు చెబుతున్నారు. అంతేగాక, ఆమె లండన్ పోలీస్ అధికారిగా ఉండి క్రమశిక్షణ తప్పడంపై కూడా చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి ‘బిగ్ బ్రదర్’ ఆమెను కష్టాల్లోకి నెట్టేశాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here