బిజినెస్ కోసం టిక్ టాక్‌ను ఎలా వాడుతున్నారో తెలుసా?

0
2


బిజినెస్ కోసం టిక్ టాక్‌ను ఎలా వాడుతున్నారో తెలుసా?

టిక్ టాక్… ఈ పేరు తెలియని స్మార్ట్ ఫోన్ వినియోగ దారులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. టిక్ టాక్ ద్వారా కోట్లాది మంది వివిధ రకాల వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. కోట్లాది మంది వీడియోలు చూస్తున్నారు. కొత్త వినియోగ దారులు పెరుగుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి వినియోగదారులను తమ వ్యాపారానికి అవకాశంగా మార్చుకుంటున్నాయి కంపెనీలు. అదెలాగంటే.. టిక్ టాక్ లోనే తమ ఉత్పత్తులకు సంబందించిన చిన్న వీడియోలు చేస్తున్నాయి. వీటి ద్వారా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించుకొని వ్యాపారం పెంచుకుంటున్నాయి.

ఫోన్ల కంపెనీల నుంచి ఈ – కామర్స్ కంపెనీల దాకా

* కస్టమర్లను టార్గెట్ చేసుకున్న కంపెనీలు తమ ప్రచారానికి అవకాశం ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. ఇప్పటికే కంపెనీలు టీవీలు, పత్రికలూ, అవుట్ డోర్ యాడ్స్, డిజిటల్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తున్నాయి. వీటితో పాటు ఎక్కువ పాపులర్ అయినా అప్స్ ను కూడా తమ ప్రచారం కోసం వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగా యూట్యూబ్, టిక్ టాక్ వంటి వాటిని వినియోగించుకుంటున్నాయి.

* మొబైల్ ఫోన్ల కంపెనీలు, శీతల పానీయాల కంపెనీలు, ఫ్యాషన్ బ్రాండ్స్ వంటివి ఇప్పటికే టిక్ టాక్ ను వినియోగించుకుంటూ మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరువవుతున్నాయి.

* ఒప్పో, వివో, క్లబ్ ఫ్యాక్టరీ, పెప్సికో, మింట్రా, స్నాప్ డీల్ వంటివి జోరుగా టిక్ టాక్ ను వాడుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కూడా చేరింది. తన బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాలకు సంబంధించిన ప్రచార వీడియోను మూడు రోజుల్లోనే 300 కోట్ల వ్యూ లను సంపాదించుకుంది. ఇందులో ఒక శాతం మంది కొనుగోళ్లు జరిపినా ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో అంచనా వేయవచ్చు..

ఇదీ లెక్క

ఇదీ లెక్క

* మన దేశంలో నెలవారీగా 12 కోట్లకు పైగా యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్టు టిక్ టాక్ చెబుతోంది.

* తన యాప్ కున్న పాపులారిటీ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై సంస్థ దృష్టిసారిస్తోంది.

* సిల్వర్, గోల్డ్ ప్యాకేజీల పేరుతో కంపెనీల నుంచి చార్జీలు వసూలు చేస్తోంది. ఇన్ని కోట్ల వ్యూ లకు హామీ ఇస్తోంది. ఇది ఉభయ తారకంలా ఉంటోంది.

* తమ వీడియోల ద్వారా ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వారు కూడా ప్రకటనల ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారట.

*పాపులర్ యాప్ ల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని చేరుకోవడానికి అవకాశం ఉంటున్నందువల్ల కంపెనీలు ఇలాంటి విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఖర్చు తక్కువ లాభం ఎక్కువ

ఖర్చు తక్కువ లాభం ఎక్కువ

* డిజిటల్ మీడియా ద్వారా ప్రచారానికి కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. సోషల్ మీడియా యాప్స్, మెయిల్స్, వీడియోల ద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువగా ప్రచాచారం చేసుకునే అవకాశం ఉండటం వల్ల కంపెనీలు వీటికి పెద్దపీట వేస్తున్నాయి. వ్యాపారాల్లో మందగమనం నేపథ్యంలో కంపెనీలు ప్రకటనల కోసం ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండే మార్గాలను మార్గాలను ఎంచుకుంటున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here