బిజినెస్ ట్రిక్: అమెజాన్‌కు షాక్, ఫ్లిప్‍‌కార్ట్‌లో ఉచిత వీడియోలు

0
0


బిజినెస్ ట్రిక్: అమెజాన్‌కు షాక్, ఫ్లిప్‍‌కార్ట్‌లో ఉచిత వీడియోలు

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూనిట్ భారత్‌లోని చిన్న పట్టణాలు, నగరాల నుంచి కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మరియు ప్రత్యర్థి అమెజాన్ ప్రైమ్ వీడియోకు పోటీగా ఉచిత వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది. ఆన్‌లైన్ ఉపయోగించే నెక్స్ట్ 200 మిలియన్ యూజర్లను ఫ్లిప్‌కార్ట్ టార్గెట్‌గా చేసుకుంది. ఆన్ లైన్ వీడియోల ద్వారానే ఎక్కువమంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లుగా భావిస్తోంది. యూజర్లు ఆన్‌లైన్‌లోకి వచ్చి కొనుగోలు చేయడంలో వీడియో కంటెంట్, వినోదం పెద్ద పాత్ర పోషిస్తాయని భావిస్తోంది.

పలు భాషల్లో వీడియో ప్లాట్‌ఫాం

ఫ్లిప్‌కార్టును కొద్ది రోజుల క్రితం వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వ్యాపార విస్తరణకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఉచిత వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించనుంది. దీంతో తన పోటీదారు అమెజాన్‌ను కూడా ఎదుర్కోనుంది. పలు భాషల్లో వీడియో ప్లాట్‌ఫాంను తీసుకు రానుంది.

విస్తరణకు చర్చలు

విస్తరణకు చర్చలు

ఫ్లిప్‌కార్ట్ వీడియోస్ పేరిట ఈ సేవలు ప్రారంభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ పైన వినియోగదారులకు ఉచితంగా లభిస్తాయి. షార్ట్ ఫిలిమ్స్, పూర్తి స్థాయి సినిమాలు, ధారావాహికలు వంటివి ఇందులో చూడవచ్చు. వీటిని విస్తరించడానికి కంటెంట్‌ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు ఈ ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించింది.

భారీగా పెట్టుబడి

భారీగా పెట్టుబడి

వీడియో సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నామని, షాపింగ్‌తో పాటు యూజర్లు వినోదాన్ని కూడా ఇష్టపడుతున్నారని, వారు మెచ్చే వీడియోలను అందుబాటులోకి తెస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌కు 15 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను హిందీలోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులను 20 కోట్లకు పెంచుకుంటామన్నారు. రాబోయే నెలల్లో తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో సైతం తీసుకు వస్తామన్నారు.

పెరుగుతున్న వీడియో కంటెంట్ మార్కెట్

పెరుగుతున్న వీడియో కంటెంట్ మార్కెట్

కంటెంట్ మార్కెట్ అభివృద్ధి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‍ సభ్యత్వాలను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకుంటున్న వినియోగదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని మార్కెట్ వృద్ధి చెందుతున్నట్లుగా అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ఇప్పటికి ఎక్కువ పోటీ లేదని, చీప్ కంటెంట్‌కు ఎక్కువ ధర ఉందని చెబుతున్నారు. భారతదేశంలో కంటెంట్, ధర చాలా కీలకమని చెబుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సేవలు 2016 డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here